అలాంటి అవసరాలు నాకు లేవు: కేసీఆర్ తో జేసీ దివాకర్ రెడ్డి భేటీ

By narsimha lodeFirst Published Sep 24, 2021, 3:09 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలను పురస్కరించుకొని అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి  సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) తో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి (JC Diwakar Reddy) శుక్రవారం నాడు భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)ఆవరణలోని  సీఎం చాంబర్‌లో  మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి  కేసీఆర్ ను కలిశారు. అరగంటపాటు కేసీఆర్ తో జేసీ మాట్లాడారు.

ఈ సమావేశం ముగిసిన తర్వాత జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తో భేటీలో రాజకీయ పరమైన అంశాలు చర్చించలేదని చెప్పారు. అలాంటి అవసరాలు కూడా తనకు లేవని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.మర్యాద పూర్వకంగానే తాను కేసీఆర్ ను కలిసినట్టుగా జేసీ దివాకర్ రెడ్డి చెప్పారు..

also read:డ్యామేజీ చేయొద్దు: జేసీ దివాకర్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఫైర్

ఏపీలో తమను కలుపుకొనిపోకపోవడం తప్పని సీఎం కేసీఆర్ కు చెప్పానన్నారు. అయితే పరిస్థితులు అలా ఉంటాయని కేసీఆర్ తనతో చెప్పారని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు.అంతకుముందు మంత్రి కేటీఆర్ తో అసెంబ్లీ లాబీల్లో జేసీ దివాకర్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీకి ముందుగా ఆయన సీఎల్పీలో తన పాత మిత్రులను కలుసుకొన్నారు. కొద్దిసేపు వారితో మాట్లాడారు.


 

click me!