నిజామాబాద్ లో కేసీఆర్ టూర్: నూతన కలెక్టరేట్, టీఆర్ఎస్ భవనాల ప్రారంభం

By narsimha lode  |  First Published Sep 5, 2022, 3:35 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. నూతన కలెక్టరేట్  తో పాటు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు నూతన కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు చేశారు. 


నిజామాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. హైద్రాబాద్ నుండి నేరుగా నిజామాబాద్ కు  సీఎం కేసీఆర్ చేరుకున్నారు. నిజామాబాద్ లో  టీఆర్ఎస్ జిల్లా నూతన కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు.  పార్టీ కార్యాలయంలో పతాకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహనికి పూలమాలలు వేసి కేసీఆర్ నివాళులర్పించారు. పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు.పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కను నాటారు. పార్టీ కార్యాలయంలో ప్రతి గదిని సీఎం కేసీఆర్ పరిశీలించారు. 

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో నూతన కలెక్టరేట్ల కార్యాలయాల నిర్మాణాలను చేపట్టింది.  ఇటీవలనే వికారాబాద్, మేడ్చల్ , రంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల కలెక్టరేట్ల నూతన కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఇవాళ నిజామాబాద్ కలెక్టరేట్ ను ప్రారంభించారు. 

Latest Videos

undefined

నిజామాబాద్ లో 25 ఎకరాల్లో నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. 1,59,306 చదరపు అడుగుల ఏరియాలో రూ. 53.52 కోట్లతో ఈ కొత్త కలెక్టరేట్ ను సీఎం ప్రారంభించారు. కలెక్టర్, ఇద్దరు జాయింట్ కలెక్టర్ల చాంబర్లతో పాటు 20 మందికి పైగా ఉద్యోగులకు చాంబర్లను ఏర్పాటుచేశారు. ఒక్కో ఫ్లోర్ లో 32 మంది కూర్చునే సామర్ధ్యంతో కాన్ఫరెన్స్ హాల్స్ ను ఏర్పాటు చేశారు. విశాలమైన వర్కి స్టేషన్లతో పాటు ప్రత్యేక రికార్డులను భధ్రపర్చేందుకు స్ట్రాంగ్ రూమ్ లను కూడా ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్,  పబ్లిక్ ఈవెంట్లు నిర్వహించేందుకు వీలుగా కలెక్టరేట్ ను నిర్మించారు

నూతన కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రసంగించారు.  నిజామాబాద్ లో నూతన కలెక్టరేట్ ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్దిలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు  తెలంగాణ ప్రగతి ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని సీఎం చెప్పారు.

click me!