వినాయక నిమజ్జనంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రభుత్వానిదే బాధ్యత.. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

By Sumanth KanukulaFirst Published Sep 5, 2022, 1:07 PM IST
Highlights

వినాయక నిమజ్జనంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రభుత్వానిదే బాధ్యత అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హెచ్చరించారు. వినాయక నిమజ్జన తేదీపై కొన్ని దుష్టశక్తులు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. 

వినాయక నిమజ్జనంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రభుత్వానిదే బాధ్యత అని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు హెచ్చరించారు. వినాయక నిమజ్జన తేదీపై కొన్ని దుష్టశక్తులు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సెప్టెంబర్ 9వ తేదీనే గణేష్ నిమజ్జనం అని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జం చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్న వెనక్కి తగ్గేది లేదన్నారు. ప్రతి ఒక్కరు వినాయక నిమజ్జనానికి వినాయక సాగర్(హుస్సేన్ సాగర్) తరలిరావాలని పిలపునిచ్చారు. 

వినాయక నిమజ్జనానికి సంబంధించిన కోర్టు ఆదేశాలపై ప్రభుత్వం ఎందుకు రివ్యూకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో హిందూ ఎమ్మెల్యేలంతా దీని గురించి మాట్లాడాలని కోరారు. వినాయక నిమజ్జనాలపై ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. నిమజ్జనాల వల్ల హుస్సేన్ సాగర్ కలుషితం కావడం లేదని అన్నారు. హుస్సేన్ సాగర్ర‌లోనే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం చేయనున్నట్టుగా చెప్పారు. వినాయక నిమజ్జనాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. 

హిందూ పండగలపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. గైడ్‌ లైన్స్ పేరుతో హిందూ పండగలపై ఆంక్షలు తగదని అన్నారు. రేపు హుస్సేన్ సారగ్ చుట్టూ బైక్ ర్యాలీ చేపట్టనున్నట్టుగా చెప్పారు. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా గణేష్ నిమజ్జన ఉత్సవాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలకు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఉడిపి పెజావర్ స్వామి హాజరుకానున్నట్టుగా చెప్పారు. 

click me!