ఈటల శాఖ తొలగింపు: యాక్షన్‌లోకి దిగిన కేసీఆర్.. కరోనాపై ప్రత్యేకాధికారి నియామకం

Siva Kodati |  
Published : May 01, 2021, 03:48 PM IST
ఈటల శాఖ తొలగింపు: యాక్షన్‌లోకి దిగిన కేసీఆర్.. కరోనాపై ప్రత్యేకాధికారి నియామకం

సారాంశం

కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని కేసీఆర్ నియమించారు.

కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనాపై పర్యవేక్షణకు సీఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డిని కేసీఆర్ నియమించారు. కరోనా విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ప్రతిరోజూ మూడు సార్లు రివ్యూ నిర్వహించిన స్వయంగా పర్యవేక్షించాలని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు.

రెమ్‌డిసివర్ వంటి మందుల విషయంలో గానీ, వ్యాక్సిన్‌ల విషయంలో గానీ ఆక్సిజన్, బెడ్‌ల లభ్యత విషయంలో గానీ ఏ మాత్రం లోపం రానీయవద్దని సీఎం సూచించారు. ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరూ జాగ్రత్తగా వ్యవహరిస్తూ విధులు నిర్వహించి వీలైనంత త్వరలో రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి నుంచి బయటపడేయాలని కేసీఆర్ కోరారు.

Also Read:ఈటెల నుంచి శాఖ ఔట్: కేసీఆర్ ఇటీవలి వ్యాఖ్యల ఆంతర్యం అదేనా...

అంతకుముందు తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించిన మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈటల నిర్వర్తిస్తున్న వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆర్‌కు కేటాయిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర కేబినెట్‌లో ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ వుండనున్నారు. 

PREV
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu