కేసీఆర్ వ్యూహానికి ఈటెల రాజేందర్ కౌంటర్ వ్యూహం ఇదీ...

By telugu teamFirst Published May 1, 2021, 3:31 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాన్ని తిప్పికొట్టడానికి మంత్రి ఈటెల రాజేందర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. తనపై కేసీఆర్ చర్యలు తీసుకోవడాన్నే ఆయన ఆశిస్తున్నట్లు భావస్తున్నారు.

హైదరాబాద్: మంత్రి ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. కేసీఆర్ వ్యూహానికి ఈటెల రాజేందర్ కౌంటర్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈటెల రాజేందర్ ను పక్కకు తప్పించే ఎత్తుగడలో భాగంగా కేసీఆర్ ఒక్కొక్క అడుగే ముందుకు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. 

భూకబ్జా ఆరోపణలు వచ్చి, తాను విచారణకు ఆదేశించిన వెంటనే ఈటెల రాజేందర్ మంత్రి పదవికి రాజీనామా చేస్తారని బహుశా కేసీఆర్ ఊహించి ఉంటారు. కానీ, ఈటెల రాజేందర్ రాజీనామాకు ముందుకు రాలేదు. పైగా తాను రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ మీద భూకబ్జా ఆరోపణలు రావడం, వెంటనే కేసీఆర్ విచారణకు ఆదేశించడం ఆఘమేఘాల మీద జరిగిపోయింది. 

Also Read: ఎట్టి స్థితిలోనూ కేసీఆర్ కలువను, ప్లాన్ ప్రకారమే జరుగుతోంది: ఈటెల రాజేందర్

ఆ తర్వాత శుక్రవారం రాత్రి ఈటెల రాజేందర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి నేరుగా కేసీఆర్ ఢీకొట్టబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. దీంతో కేసీఆర్ శనివారంనాడు ఆయన ఈటెల రాజేందర్ నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించారు. దీంతోనైనా ఈటెల రాజేందర్ మంత్రి పదవికి రాజీనామా చేస్తారని కేసీఆర్ అనుకుని ఉంటారు. తనను వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించడంపై ప్రతిస్పందించినప్పటికీ తాను రాజీనామా చేస్తానని చెప్పలేదు. తన నియోజకవర్గం ప్రజలతో మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 

ఈ స్థితిలో కేసీఆర్ ఈటెల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తారా అనే ప్రశ్న ఉదయిస్తోంది. బహుశా, కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేసినా ఆశ్చర్యం లేదు. ఈటెల రాజేందర్ మంత్రివర్గంలో గానీ, టీఆర్ఎస్ లో గానీ కొనసాగే పరిస్థితి లేదని మాత్రం అర్థమవుతోంది. మంత్రివర్గం నుంచి తప్పించడంతో పాటు టీఆర్ఎస్ నుంచి కూడా ఆయన బయటకు పంపే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.

Also Read: ఈటెల నుంచి శాఖ ఔట్: కేసీఆర్ ఇటీవలి వ్యాఖ్యల ఆంతర్యం అదేనా....

తనను బర్తరఫ్ చేసే దాకా ఆగాలనే ఈటెల రాజేందర్ ఆగాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది. టీఆర్ఎస్ నుంచి కూడా తప్పించే దాకా ఆయన వేచి చూసే ధోరణిని అవలంబించే అవకాశం ఉంది. ఆ తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని ఆయన యోచిస్తున్నట్లు చెబుతున్నారు

ఇప్పటికే ఈటేల రాజేందర్ నివాసానికి ఆయన నివాసానికి వస్తున్నారు. ఈటెల రాజేందర్ నుంచి శాఖను తీసుకోవడంపై అనుచరులు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ చెప్తే ఈటెల రాజేందర్ మంత్రి పదవి నుంచి తప్పుకుని ఉండేవారని వారు అంటున్నారు. పదవుల కోసం ఈటెల రాజేందర్ పాకులాడలేదని ఆయన అన్నారు. పైగా బడుగు, బలహీనవర్గాలకు చెందిన నేత ఈటెల రాజేందర్ ను మేడే రోజున వైద్య ఆరోగ్య శాఖ నుంచి తప్పించడాన్ని వారు తప్పు పడుతున్నారు.

click me!