తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్ధుల తరపున కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి రోజూ నాలుగు ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు. విపక్షాలపై కేసీఆర్ పదునైన విమర్శలు చేస్తున్నారు.
దేవరకద్ర: తాను చెప్పే మాటలు నిజం కాకపోతే తమ పార్టీని ఓడించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు.సోమవారంనాడు దేవరకద్రలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
సమైఖ్య రాష్ట్రంలో పాలమూరును ఎవరూ పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే ఎలా పనిచేస్తుందో మీకు తెలుసునన్నారు. దేవరకద్రలో లక్ష ఎకరాల్లో వరి పండేలా చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేసీఆర్ చెప్పారు.ఎవరూ అధికారంలో ఉంటే మేలు జరుగుతుందో ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ కోరారు. ఓటు వేసే ముందు అభ్యర్ధిని, పార్టీని చూడాలన్నారు.
undefined
పాలమూరును సర్వనాశనం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనన్నారు. కృష్ణా, తుంగభద్ర నదులున్నా పాలమూరు కరువు చూసిందన్నారు.తమ పార్టీతో పొత్తు పెట్టుకొని తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని కేసీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ మోసం చేయడంతో తాను ఆమరణ నిరహారదీక్ష చేస్తే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైందని కేసీఆర్ వివరించారు. ఉద్యమాలకు తలొగ్గి కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ ఇచ్చిందని ఆయన చెప్పారు. పిడికెడు మందితో యావత్ తెలంగాణను నిద్ర లేపినట్టుగా కేసీఆర్ గుర్తు చేశారు.
Live: ప్రజా ఆశీర్వాద సభ, దేవరకద్ర https://t.co/djLMgw0Ef1
— BRS Party (@BRSparty)ఒకనాడు పాలు కారేలా పాలమూరు జిల్లా ఉండేదన్నారు. పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నామని కొందరు సీఎంలు శిలాఫలకాలు వేసి చేతులు దులుపుకున్నారని ఆయన విమర్శించారు. పాలమూరు జిల్లాలో గతంలో గంజి కేంద్రాలు నడిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆయన ఆరోపించారు.
తమ పాలనలో పాలమూరులో అనేక అభివృద్ది కార్యక్రమాలతో పాటు, ప్రాజెక్టులను నిర్మించిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. తాను చెప్పే విషయాలు నిజం కాకపోతే తమకు ఓటేయవద్దని కేసీఆర్ కోరారు.