తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం: కీలక బిల్లులు ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్

By Nagaraju penumalaFirst Published Jul 18, 2019, 11:35 AM IST
Highlights

రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు, వైద్య విద్యాకోర్సులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతీ సంవత్సరం 50 మంది ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నారని ఈ పెంపు వల్ల ఆ పరిమితి తగ్గి అధ్యాపకుల కొరత రాదన్నారు. 

అమరావతి: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో కొత్త మున్సిపాలిటీ విధానంపై  బిల్లు ప్రవేశపెట్టారు. ఇకపోతే కొత్త మున్సిపాలిటీ బిల్లుపై మంగళవారం చర్చ జరుగనుంది. 

అనంతరం రాష్ట్రంలో మెడికల్, డెంటల్ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల వయోపరిమితి 55 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలకు పెంచుతూ మరో బిల్లు ప్రవేశపెట్టారు. మెడికల్ కళాశాలల్లో ఒక ప్రొఫెసర్ 70 సంవత్సరాల వరకు పనిచేయగలరని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసిన నేపథ్యంలో వారి వయోపరిమితిని పెంచడం జరిగిందని కేసీఆర్ తెలిపారు. 

దేశమంతా ఇదే పద్ధతిని అవలంభిస్తుందని తెలిపారు. ప్రొఫెసర్లు కావాలంటే సీనియారిటీ ప్రకారం రావాల్సి ఉంటుందని ఈ నేపథ్యంలో వారి వయోపరిమితిని పెంచినట్లు తెలిపారు. అధ్యాపకులు లేక ప్రతీ సంవత్సరం మెడికల్ కళాశాలల్లో సీట్ల సంఖ్య తగ్గిస్తూ వస్తున్నారని అలాంటి పరిస్థితి ఇకపై రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

మెడికల్ కళాశాలల్లో సీట్లు తగ్గకుండా ఉండటంతోపాటు, మెడికల్ విద్యార్థుల భవిష్యత్ కోసం, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ వయోపరిమితి పెంపుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. 

రాష్ట్రంలో వైద్య విద్యార్థులకు, వైద్య విద్యాకోర్సులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతీ సంవత్సరం 50 మంది ప్రొఫెసర్లు రిటైర్ అవుతున్నారని ఈ పెంపు వల్ల ఆ పరిమితి తగ్గి అధ్యాపకుల కొరత రాదన్నారు. 

click me!