తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం: నూతన మున్సిపల్ బిల్లుకు ఆమోదం..?

By Nagaraju penumalaFirst Published 17, Jul 2019, 4:39 PM IST
Highlights

నూతన మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాతే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 
 
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న నూతన మున్సిపల్ చట్టానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. మున్సిపల్ చట్టానికి ఆమోద ముద్రకోసం టీఆర్ఎస్ ప్రభుత్వం వేగంగా పావులు  కదుపుతోంది. 

అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర క్యాబినేట్ సమావేశం నిర్వహించారు సీఎం కేసీఆర్. రాష్ట్రప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకురాబోతున్న నూతన మున్సిపల్  బిల్లు ఆమోదం తెలపనుంది.  

కేబినెట్ నూతన మున్సిపల్ పాలసీని అంగీకారం తెలిపిన తర్వాత ఆ బిల్లును గవర్నర్ నరసింహన్ వద్దకు పంపనుంది. గవర్నర్ ఆ బిల్లును అంగీకరిస్తే వెంటనే నూతన మున్సిపల్ చట్టం అమలులోకి రానుంది. 

నూతన మున్సిపల్ చట్టం అమలులోకి వచ్చిన తర్వాతే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. 

Last Updated 17, Jul 2019, 4:39 PM IST