కొత్త సచివాలయ నిర్మాణం: పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

Published : Jan 26, 2021, 01:28 PM IST
కొత్త సచివాలయ నిర్మాణం: పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

సారాంశం

కొత్త సచివాలయ నిర్మాణ పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు పరిశీలించారు. 


హైదరాబాద్: కొత్త సచివాలయ నిర్మాణ పనులను తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు పరిశీలించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొని ప్రగతి భవన్ కు తిరిగి వెళ్తూ కొత్త సచివాలయ నిర్మాణ పనులను కేసీఆర్  పరిశీలించారు.

కొత్త సచివాలయ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయనే విషయాన్ని ఆయన అధికారులను అడిగి తెలుసుకొన్నారు.  సీఎం వెంట పలువురు మంత్రులు, అధికారులున్నారు.తెలంగాణ సచివాలయ నిర్మాణ పనులకు  2019 జూన్ 26వ తేదీన సీఎం శంకుస్థాపన చేశారు.

కొత్త సచివాలయ నిర్మాణ పనులు గత ఏడాది నవంబర్ 6వ తేదీన ప్రారంభమయ్యాయి. తెలంగాణ సచివాలయ నిర్మాణ పనుల గురించి సీఎం అధికారుల నుండి ఆరా తీశారు. ఈ పనుల విషయంలో కొన్ని సలహాలు సూచనలను సీఎం అధికారులకు చేశారు.రాత్రి పగలు అనే తేడా లేకుండా సచివాల య నిర్మాణ పనులు సాగుతున్నాయి.

ఆయా మంత్రుల కార్యాలయాలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీల కార్యాలయాలను కూడ ఒకే చోట నిర్మించనున్నారు. గతంలో ఏపీకి కేటాయించిన భవనాలను కూడ తెలంగాణకు ఏపీ కేటాయించింది. సచివాలయానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్మాణాలన్నీ ఒకేచోట ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది.


 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం