రోడ్డు పక్కన నగ్నంగా మహిళకు పోలీసుల సాయం...!

Published : Jan 26, 2021, 12:46 PM ISTUpdated : Jan 26, 2021, 01:11 PM IST
రోడ్డు పక్కన నగ్నంగా మహిళకు పోలీసుల సాయం...!

సారాంశం

ఓ మహిళ ఒంటిపై దుస్తులు లేకుండా అచేతనంగా పడి ఉండడంతో ఇద్దరు మహిళా పోలీసులను రప్పించి ఆమెకు దుస్తులు వేశారు. మంచినీరు అందించారు

రోడ్డు పక్కన అచేతనంగా, కనీసం ఒంటిపై దుస్తులు కూడా లేకుండా నగ్నంగా ఉన్న ఓ మహిళ(45)ను రాజేంద్ర నగర్ పోలీసులు ఆదుకున్నారు. ఆమెకు వేసుకోవడానికి దుస్తులు వేసి.. తినడానికి ఆహారం అందించారు. సదరు మహిళకు తినేందుకు కూడా ఓపిక లేకపోవడంతో పోలీసులే స్వయంగా తినిపించారు.

రంగారెడ్డి జిల్లాలోని హార్టికల్చర్‌ యూనివర్సిటీ ద్వారం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో ఓ మహిళ పడి ఉందని 100 నంబర్‌కు సమాచారం అందింది. వెంటనే రాజేంద్రనగర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఓ మహిళ ఒంటిపై దుస్తులు లేకుండా అచేతనంగా పడి ఉండడంతో ఇద్దరు మహిళా పోలీసులను రప్పించి ఆమెకు దుస్తులు వేశారు. మంచినీరు అందించారు. తినేందుకు ఏమైనా ఇవ్వాలని ఆమె సైగలు చేయడంతో పోలీసులు అన్నం తీసుకొచ్చి అందించారు. 

అన్నం కలిపి నోట్లో పెట్టుకునేందుకు కూడా ఆ మహిళ ఇబ్బంది పడుతుండడంతో మహిళా కానిస్టేబుళ్లు ఆమెకు తినిపించి ఠాణాకు తీసుకొచ్చారు. తన పేరు రాజమణి.. కుమారుడి పేరు మహేశ్‌ అని మహిళ తెలిపింది. మహిళను హైదర్షాకోట్‌లోని కస్తూర్బా ట్రస్ట్‌కు తరలించారు. మహిళ అక్కడికి ఎలా వచ్చిందో తెలుసుకునేందుకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం