మహబూబాబాద్ కొత్త కలెక్టరేట్ భవనం: ప్రారంభించిన సీఎం కేసీఆర్

Published : Jan 12, 2023, 01:12 PM ISTUpdated : Jan 12, 2023, 02:55 PM IST
మహబూబాబాద్ కొత్త కలెక్టరేట్  భవనం: ప్రారంభించిన  సీఎం కేసీఆర్

సారాంశం

మహబూబాబాద్  కొత్త కలెక్టరేట్  కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  కలెక్టరేట్ లో నిర్వహించిన  ప్రత్యేక పూజల్లో  సీఎం కేసీఆర్  పాల్గొన్నారు. 

మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో  నూతన కలెక్టరేట్ కార్యాలయాన్ని  తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం నాడు ప్రారంభించారు.  కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత  పోలీసుల గౌరవ వందనాన్ని సీఎం స్వీకరించారు. అనంతరం   కలెక్టరేట్ లో  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ట్రంలో  ఇప్పటికే  14 జిల్లాల్లో  కొత్త కలెక్టరేట్లను సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  ఇంకా  ఎనిమిది కలెక్టరేట్ల నిర్మాణాలు  సాగుతున్నాయి.  మరో నాలుగైదు రోజుల్లో భద్రాచలం ,ఖమ్మం కలెక్టరేట్లను కూడా  సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.   తెలంగాణ సీఎస్ గా  శాంతికుమారి బాధ్యతలు స్వీకరించిన  తర్వాత  మహబూబాబాద్ నూతన కలెక్టరేట్ ను  సీఎం కేసీఆర్ ప్రారంభించారు.  కేసీఆర్ తో పాటు  పలువురు మంత్రులు,  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారి,  అధికారులు   కలెక్టరేట్  ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.  కలెక్టర్ చాంబర్ లో  సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ను సీఎం కుర్చీలో  కూర్చోబెట్టారు. అంతకుముందు  మహబూబాబాద్ లో  సీఎం కేసీఆర్  బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.  
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
సైబర్ మోసాలపై అలర్ట్ చేసిన నాగార్జున సూపర్ స్పీచ్ | Akkineni Nagarjuna Cyber Awareness Programme