భారీ వర్షం: కేసీఆర్ హుజూర్‌నగర్ బహిరంగసభ రద్దు

By sivanagaprasad KodatiFirst Published Oct 17, 2019, 2:36 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ రద్దయ్యింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది.. ఎంతకు వాన తెరిపినివ్వకపోవడంతో సభను రద్దు చేయాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వర్షం కారణంగా సభా వేదిక చిత్తడిగా మారిపోయింది.
 

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ రద్దయ్యింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురుస్తోంది.. ఎంతకు వాన తెరిపినివ్వకపోవడంతో సభను రద్దు చేయాలని టీఆర్ఎస్ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

వర్షం కారణంగా సభా వేదిక చిత్తడిగా మారిపోయింది. దీనికి తోడు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్‌లో ప్రయాణించేందుకు సివిల్ ఏవియేషన్ శాఖ అనుమతి ఇవ్వలేదు. మార్గమధ్యంలో ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షం పడుతుండటంతో పైలట్ల సూచన మేరకు సీఎం పర్యటనకు అనుమతి రద్దు చేసినట్లు ఏవియేషన్ డైరెక్టర్ భరత్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వస్తారని ఎన్నో ఏర్పాట్లు చేసిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు వర్షంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. 

హుజూర్‌నగర్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 21వ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి. బీజేపీ, టీడీపీలు తమ ఉనికిని చాటుకొనేందుకు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగాయి.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009 నుండి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే స్థానం నుండి గెలుపొందారు. మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి పోటీకి దిగారు. పద్మావతిని గెలిపించుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ తన సర్వశక్తులను ఒడ్డుతోంది.

 ఈ అసెంబ్లీ స్థానం నుండి టీఆర్ఎస్ ఇంతవరకు విజయం సాధించలేదు. ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులను ఒడ్డుతోంది. 

ప్రజలంతా రాష్ట్రంలో టీఆర్ఎస్ వైపు ఉన్నారని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తే  హుజూర్‌నగర్ లో కాంగ్రెస్, నాలుగు ఎంపీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. 

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.2018 డిసెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ రెండు అసెంబ్లీ స్థానాలను మాత్రమే కైవసం చేసుకొంది. గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య  టీఆర్ఎస్ లో చేరారు.  ఆశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వర్ రావు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి టీడీపీ మద్దతును ప్రకటించింది.కానీ, ఈ ఎన్నికల్లో పోటీ చేయడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చ సాగుతోంది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి నెలకొన్న తరుణంలో ఆ పార్టీ నాయకత్వం కళ్లు తెరిచిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

పార్టీని కాపాడుకొనే ఉద్దేశ్యంతోనే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీకి దిగింది. హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీకి బలమైన క్యాడర్ కానీ, నాయకత్వంకానీ లేదు. ఈ నియోజకవర్గంలో గణనీయంగా ఉన్న పెరిక సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకర్షించేందుకు అదే సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ కోట రామారావును ఆ పార్టీ బరిలోకి దింపింది.

గత ఎన్నికల్లో బీజేపీకి 1555 ఓట్లు మాత్రమే వచ్చాయి. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా భాగ్యారెడ్డి పోటీకి దిగారు. ఆ ఎన్నికల్లో నోటాకు 1600కు పైగా ఓట్లు వచ్చాయి.అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకొంది.

 నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకోవడంతో రాష్ట్రంలో తమ బలం పెరిగిందని ఆ పార్టీ భావిస్తోంది. హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తమ పార్టీకి మెరుగైన ఓట్లు లభిస్తాయని  కమలదళం విశ్వాసంతో ఉంది.

సంబంధిత వార్తలు:

హుజూర్‌నగర్ బైపోల్: టీఆర్ఎస్ కు సీపీఐ షాకివ్వడం వెనుక

click me!