టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై మరో కేసు

By narsimha lodeFirst Published Oct 17, 2019, 1:47 PM IST
Highlights

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై కేసు నమోదైంది.తప్పుడు గుర్తింపు కార్డును జారీ చేశారని పోలీసులు ఈ కుేసు నమోదదు చేశారు. 

హైదరాబాద్: టీవీ9  మాజీ సీఈఓ రవిప్రకాష్‌పై గురువారం నాడు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారుద. నకిలీ ఐడీ  కేసులో ఈ కేసు నమోదు చేశారు. ఇప్పటికే టీవీ9 సంస్థ నిధుల మళ్ళింపుల కేసులో  రవిప్రకాష్ అరెస్టయ్యారు. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ జైలులో ఉన్నారు.

అలందా మీడియా రవిప్రకాష్ పై గతంలో ఫిర్యాదు చేసింది.ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపారు. టీవీ9 సంస్థకు చెందిన నిధులను రవిప్రకాష్ అదే సంస్థకు చెందిన మూర్తితో కలిసి దారి మళ్లించారని పోలీసులు నిర్ధారించారు. 

ఈ కేసులో రవిప్రకాష్ ను ,పోలీసులు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అదే రోజున ఆయనను అరెస్ట్ చేస్తున్నట్టుగా పోలీసులు ప్రకటించారు. అరెస్ట్ చేసిన తర్వాత రవిప్రకాష్ ప్రస్తుతం చంచల్ గూడ జైల్లో ఉన్నాడు.

చంచల్‌గూడ జైలులో ఉన్న రవిప్రకాష్ పై తాజాగా మరో కేసు నమోదైంది. ఐ ల్యాబ్ పేరు తో నటరాజన్ అనే వ్యక్తి పేరు మీద   నకిలీ  గుర్తింపు  కార్డును రవిప్రకాష్  క్రియేట్ చేసినట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. 

హైద్రాబాద్ సీసీఎస్ పోలీసులు  406/66  ఐటీ  యాక్ట్ కింద కేసు నమోదు  చేశారు. ఈ కేసులో చంచల్ గూడ జైలులో ఉన్న రవిప్రకాష్ ను పీటీ వారంట్‌పై పోలీసులు మియాపూర్ కోర్టుకు తీసుకొస్తున్నారు. 

టీవీ9 సంస్థను అలంద మీడియా సంస్థ ఇటీవల కొనుగోలు చేసింది. అయితే కొత్త యాజమాన్యానికి రవిప్రకాష్ కు మధ్య విభేదాలు తలెత్తాయి.ఈ తరుణంలో తమ సంస్థ డైరెక్టర్లకు తెలియకుండానే రవిప్రకాష్ స్వంతానికి నిధులను వాడుకొన్నారని అలంద మీడియా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

అలంద మీడియా సంస్థ టీవీ9ను తమ చేతుల్లోకి తీసుకొన్న వెంటనే కొత్త యాజమాన్యం సమావేశమై రవిప్రకాష్ కు టీవీ9 సంస్థతో ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఆ తర్వాత టీవీ9 సంస్థలో రవిప్రకాష్ నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టుగా  ఆలంద సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అలంద  సంంస్థ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని రవిప్రకాష్ గతంలో ప్రకటించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఆలందా మీడియా సంస్థ తప్పుడు ఫిర్యాదులు చేసిందని రవిప్రకాష్ ఆరోపించారు.

ప్రశ్నించేవారిని తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల చంచల్ గూడ జైల్లో రవిప్రకాష్ ను పరామర్శించిన తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వరుసగా రవిప్రకాష్ పై కేసులు నమోదు కావడం మీడియా వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.

 

 

click me!
Last Updated Oct 17, 2019, 9:12 PM IST
click me!