సీఎం కేసీఆర్ కు తప్పిన పెను ముప్పు..  హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య..

గులాబీ అధినేత సీఎం కేసీఆర్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ అప్రమత్తమయ్యారు.

Google News Follow Us

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ విస్తృతంగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఆయన రోజుకు రెండు నుంచి మూడు సభలో పాల్గొంటున్నారు. ఇవాళ కూడా  మహబూబ్ నగర్ జిల్లాలోని దేవరకద్ర సభలో  పాల్గొనడానికి కేసీఆర్ హెలికాప్టర్‌లో బయలుదేరారు.ఈ క్రమంలో ఆయన  ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలట్.. హెలికాప్టర్ ను తిరిగి వ్యవసాయ క్షేత్రానికి మళ్లించాడు.  సురక్షితంగా హెలికాప్టర్ ను లాండింగ్ చేశారు. దీంతో సీఎం కేసీఆర్‌కి పెనుప్రమాదం తప్పింది. మరో ఏవియేషన్ డిపార్ట్ మెంట్ మరో విమానం కోసం ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
 

Read more Articles on