ఏడవ తేదీ సభ కోసం సెంటిమెంట్ ఫాలో అవుతున్న గులాబీ బాస్...

By Arun Kumar PFirst Published Sep 4, 2018, 5:10 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం సర్వం సిద్దం చేసుకుంటున్నారు.ఇప్పటికే తమ పార్టీ బలమేంటో ప్రతిపక్షాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రగతి నివేధన సభ ను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అయితే ఇదే జోష్ ను కొనసాగించాలని భావిస్తున్న ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా ప్లాన్ సిద్దం చేశారు. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరపున భారీ సభలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సభల నిర్వహణలోనూ ముఖ్యమంత్రి తన సెంటిమెంట్లను ఫాలో అవుతున్నట్లు సమాచారం.

తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికల కోసం సర్వం సిద్దం చేసుకుంటున్నారు. తమ నాలుగేళ్ల పాలనలో జరిగిన అభివృద్ది, సంక్షేమం గురించి ప్రజలకు వివరించడానికి  రెండు రోజుల క్రితమే ప్రగతి నివేధన సభ పేరుతో భారీ బహిరంగ నిర్వహించారు. అయితే ఇదే జోష్ ను కొనసాగించాలని భావిస్తున్న ఆయన ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా ప్లాన్ సిద్దం చేశారు. అందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా పార్టీ తరపున భారీ సభలు నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ సభల నిర్వహణలోనూ ముఖ్యమంత్రి తన సెంటిమెంట్లను ఫాలో అవుతున్నట్లు సమాచారం.

సీఎం కేసీఆర్ కు జాతకాలు,వాస్తు, సెంటిమెంట్లంటే విఫరీతమైన నమ్మకం వున్న విషయం తెలిసిందే. వాస్తు దోషం ఉందన్న కారణంతోనే సీఎం సచివాలయానికి రాకుండా క్యాంపు కార్యాలయం నుండే విధులు నిర్వహిస్తున్నారని ప్రచారంలో వున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ప్రగతి భవన్ ను కూడా పక్కా వాస్తు ప్రకారమే నిర్మాణం జరిగేలా చూసుకున్నారు.  

 తాజాగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో సీఎం కేసీఆర్ అద్యక్షతన భారీ బహిరంగ సభ జరగనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ ప్రకటించారు. అయితే ఈ సభ ఏర్పాటుకు రాజకీయ కారణాలతో పాటు కేసీఆర్ సెంటిమెంట్ కూడా ఓ కారణమనే ప్రచారం జరుగుతోంది. పండితుల సూచన మేరకు శ్రావణమాసంలోనే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టాలని కేసీఆర్ భావించారని తెలుస్తోంది. అందువల్లే ప్రగతి నివేదన సభ ముగిసిన వెంటనే ఈ నెల 7 వ తేదీన హుస్నాబాద్ లో సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ  ఏడవ తేదీ చివరి శ్రావణ శుక్రవారం కావడం కూడా మరో కారణమట. 

హుస్నాబాద్ లో సభ నిర్వహణకు కూడా మరో సెంటిమెంటే కారణమంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఇది ఈశాన్యంలో ఉండటంతో ఇక్కడి నుండి ప్రచారాన్ని మొదలుపెడితే శుభం జరుగుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

మరిన్ని వార్తల కోసం కింది లింక్స్ పై క్లిక్ చేయండి

ముందస్తు సంకేతాలు: హుస్నాబాద్‌ నుండి కేసీఆర్ ఎన్నికల ప్రచారం

 

click me!