‘‘నా పెళ్లికి రండి.. మోదీకి ఓటు వేయండి’’

Published : Feb 12, 2019, 10:00 AM IST
‘‘నా పెళ్లికి రండి.. మోదీకి ఓటు వేయండి’’

సారాంశం

తాజాగా..  ఓ యవకుడు ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న తన అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు.

సినిమా హీరోలకు ఎలా అభిమానులు ఉంటారో.. రాజకీయ నాయకులకు కూడా అంతే స్థాయిలో అభిమానులు ఉంటారనడంలో సందేహం లేదు. ఆ అభిమానాన్ని చాలా మంది వీలు కుదరినప్పుడల్లా ప్రదర్శించడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా..  ఓ యవకుడు ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న తన అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు.

‘‘ఫిబ్రవరి 21న నా వివాహం. వివాహానికి వచ్చే వారు ఎలాంటి బహుమతులను తీసుకురావద్దు. వాటికి బదులుగా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఓటు వేసి.. నరేంద్ర మోదీని ప్రధానిగా మరోసారి గెలిపించండి అంతే చాలు’’  అంటూ తన వివాహ పత్రికపై అచ్చువేయించాడు.

ఓట్‌ ఫర్‌ మోదీ అని బీజేపీ ఎన్నికల చిహ్నమైన కమలం గుర్తును సైతం వెడ్డింగ్ కార్డ్ పై ముద్రించాడు. కాగా.. ఈ వెడ్డింగ్ కార్డ్  ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.  తనకు మోదీ అంటే ఎంతో అభిమానమని, గడిచిన నాలుగున్నరేళ్లలో ఎన్నో పథకాలను ఆయన ప్రవేశపెట్టారని 27 ఏళ్ల ముఖేష్‌ రావు చెప్పుకొస్తున్నారు. 

మోదీ స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్న ఆఫీసులో ప్రతి నెల స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. మరోసారి మోదీ అధికారంలోని రావాలని తాను కోరుకుంటున్నాననీ, ఆయన విజయానికి తన వంతుగా ఈవిధంగా కృషి చేస్తున్నాని పేర్కొన్నారు. అతను హైదరాబాద్ వాసీ కావడం గమనార్హం. 

PREV
click me!

Recommended Stories

Monsoon Update : బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లోకి రుతుపవనాలు.. తెలుగు రాష్ట్రాలను తాకేదెన్నడో తెలుసా..?
ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్ | Jr NTR Pays Emotional Tribute To NTR