కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై ఆ మాటలెందీ: బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు

Published : Aug 29, 2019, 04:27 PM ISTUpdated : Aug 29, 2019, 06:09 PM IST
కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై ఆ మాటలెందీ: బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు

సారాంశం

ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల అసమర్థ విధానాల కారణంగా తెలంగాణకు నష్టం జరిగిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా-గోదావరి నదీ జలాలపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. 2003లోనే తాను ఆయనకు ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా రూపు రేఖల్ని మార్చే బృహత్తర ప్రాజెక్ట్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకమన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గురువారం ఆయన ప్రాజెక్ట్ పనుల్ని పరిశీలించారు.

అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌పై కొందరు దుర్మార్గులు కేసులు వేసి నానా ఇబ్బందులకు గురిచేయడం వల్ల పనులు ఆలస్యమయ్యాయని కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రంలోని చెరువులను ప్రాజెక్ట్ కేనల్స్ ద్వారా నింపేందుకు రూ.4 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించామన్నారు. సంవత్సరం లోగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు.

గోదావరి-కృష్ణా నదులను అనుసంధానించాలని ... శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపాలని ఏపీ సీఎం జగన్ ప్రతిపాదించారని కేసీఆర్ గుర్తు చేశారు. రెండు రాష్ట్రాలలో ప్రవహించే నదుల్లోని జలాలను సద్వినియోగం చేసుకుందామని జగన్ తెలిపారన్నారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ ద్వారా మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాలకు సాగు, తాగు నీరు అందుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల అసమర్థ విధానాల కారణంగా తెలంగాణకు నష్టం జరిగిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

కృష్ణా-గోదావరి నదీ జలాలపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. 2003లోనే తాను ఆయనకు ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు.

కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పక్కాగా ఒప్పందాలు జరుగుతాయని.. ఆ తర్వాతే పనులు మొదలవుతాయని సీఎం స్పష్టం చేశారు. 

 

కాళేశ్వరాన్ని ఇంతమంది మెచ్చుకుంటుంటే.. కొందరు ఒర్వలేకపోతున్నారు: కేసీఆర్

కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై ఆ మాటలెందీ: బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు

గోదావరి నీరు శ్రీశైలం తరలింపు: జగన్, కేసీఆర్ నిర్ణయం

మరోసారి జగన్, కేసీఆర్ భేటీ... అసలు మ్యాటర్ ఇదే

ప్రగతి భవన్ కు తొలిసారి జగన్: కేసీఆర్ తో భేటీ

PREV
click me!

Recommended Stories

Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu
Telangana Weathe Update: రానున్న 24 గంటల్లో చలిపంజా వాతావరణశాఖా హెచ్చరిక| Asianet News Telugu