మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు కేసీఆర్.. పెట్రోల్ ధరలు, ఆర్టీసీ ఛార్జీలు, యాసంగిలో వరిపై కీలక ప్రకటన..?

By Siva KodatiFirst Published Nov 7, 2021, 6:07 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm ) కేసీఆర్ (kcr)  మీడియా ముందుకు రానున్నారు. యాసంగిలో వరిసాగుపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంపై దానిపైనా కేసీఆర్ తన ఉద్దేశ్యం చెప్పనున్నారు

ఆదివారం సాయంత్రం 7 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి (telangana cm ) కేసీఆర్ (kcr)  మీడియా ముందుకు రానున్నారు. యాసంగిలో వరిసాగుపై రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో సీఎం క్లారిటీ ఇవ్వనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంపై దానిపైనా కేసీఆర్ తన ఉద్దేశ్యం చెప్పనున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీల పెంపుపైనా చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేయనున్నారు.

కాగా.. యాసంగిలో వరి కొనుగోలుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి (telangana agriculture minister) నిరంజన్‌రెడ్డి (niranjan reddy) శనివారం సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. యాసంగిలో వరిని (paddy) ప్రభుత్వం కొనుగోలు చేయదని, వానాకాలం వరిపంటను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. యాసంగిలో తేమ కారణంగా బియ్యం కొనబోమని కేంద్రం చెప్పిందని మంత్రి గుర్తుచేశారు. వ్యవసాయ ఉత్పత్తులను కొనే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని.. కానీ, కొనడం లేదన్నారు. 

భవిష్యత్‌లో బాయిల్డ్‌ రైస్‌ కొనబోమని కేంద్ర స్పష్టంగా చెప్పిందని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ యాసంగిలో రైతులు వరి వేయకుండా ఇతర పంటలు వేసుకోవాలని సూచించారు. సీడ్‌ కంపెనీలతో ఒప్పందమున్న రైతులు, మిల్లర్లతో అవగాహన ఉన్న రైతులు వరి వేసుకోవచ్చని మంత్రి సూచించారు. వానాకాలంలో పండే వరి కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సాగు రంగాన్ని సీఎం కేసీఆర్‌ ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. ఎరువుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని మంత్రి వివరించారు. 

ALso Read:యాసంగిలో వరిని కొనేది లేదు.. మరోసారి కుండబద్ధలు కొట్టిన మంత్రి నిరంజన్ రెడ్డి

బీజేపీ (bjp) వాళ్లకు దమ్ముంటే కేంద్రం కొంటుందని లేఖ ఇవ్వాలని నిరంజన్ రెడ్డి సవాల్ విసిరారు. కామారెడ్డి (kamareddy district) జిల్లాలో రైతు మృతిపై (farmer death) విచారణకు ఆదేశించామని మంత్రి స్పష్టం చేశారు. వేసవిలో వరి వేయొద్దని.. విత్తనం కోసం మాత్రమే వేయాలని నిరంజన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1.41 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, 62 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారని మంత్రి తెలిపారు. వానాకాలం పంట కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని.. రైతులకు వానాకాలం పంట కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు కలిగించమని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. గతంలో పత్తిని (cotton) సాగు చేయాలని ప్రభుత్వం చెప్పిందని.. అందుకు తగ్గట్లుగానే ఈ ఏడాది పత్తికి రికార్డ్ స్థాయిలో ధర వస్తుందని తెలిపారు. కొన్ని రాజకీయపార్టీలు రైతులను ముందు పెట్టుకుని పబ్బం గడిపే ఆలోచనలో ఉన్నాయని ఆయన మండిపడ్డారు. 

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలపై (Petrol and Diesel Price Cut) ఎక్సైజ్ సుంకాన్ని తగ్గిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దేశంలో కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు (petrol and diesel Price) పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వాహనదారులకు ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ. 5, డీజిల్‌పై రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని (excise duty) తగ్గిస్తున్నట్టుగా కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలపై సుంకాన్ని తగ్గిస్తున్నట్టుగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే.. బీజేపీ అధికారంలో ఉన్న తొమ్మిది రాష్ట్రాలు కూడా అదే రకమైన నిర్ణయం తీసుకున్నాయి. బీజేపీ పాలిత.. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లు పెట్రోల్, డీజిల్ ధరలలో అదనపు తగ్గింపులను ప్రకటించాయి. 

click me!