పసుపు, కుంకం చల్లి.. మేం కట్టిన ప్రాజెక్ట్‌లను మావి అంటున్నారు: టీఆర్ఎస్‌పై భట్టి ఫైర్

Siva Kodati |  
Published : Feb 14, 2021, 04:01 PM IST
పసుపు, కుంకం చల్లి.. మేం కట్టిన ప్రాజెక్ట్‌లను మావి అంటున్నారు: టీఆర్ఎస్‌పై భట్టి ఫైర్

సారాంశం

రైతులతో ముఖాముఖీలో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదివారం శ్రీరామ్ ప్రాజెక్టును సందర్శించారు. ఆయనతోపాటు మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ఇంత పెద్ద ప్రాజెక్టును ఈ ప్రాంతానికి అందించిన తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు రుణపడి ఉండాలని అన్నారు. నేడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, జీవన స్థితిగతులు పెరిగాయంటే అందుకు ఆధునిక దేవాలయాలైన ఇలాంటి ప్రాజెక్టులే కారణమన్నారు.

ఇలాంటి ప్రాజెక్టులు పెరు చెప్పి, వాటికి కాస్త సున్నం వేసి.. వాటికి వారి పేర్లు పెట్టుకునే సంస్కృతికి టీఆర్ఎస్ నాయకులు దిగజారారని భట్టి విమర్శించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదని భట్టి ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెట్టిన బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాజెక్టును కేసీఆర్ తన ధనదాహంతో రీ డిజైన్ పేరుతో మార్చారని మండి పడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి 7 జిల్లాలకు మంచి నీరు, పరిశ్రమలకు నీటి సదుపాయంతో సహా 16 లక్షల ఎకరాలకు నీరు అందేదని విక్రమార్క వెల్లడించారు.

కేసీఆర్ ప్రాజెక్టు అంచనాలను పెంచి రూ. లక్షా 15 వేల కోట్లకు తీసుకొచ్చారని భట్టి ఆరోపించారు. కేసీఆర్ అత్యాశ వల్ల తెలంగాణ నష్టపోతోందని అన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టుల వద్ద పసుపు కుంకుమ జల్లి.. మా వల్లే ఈ నీళ్లు పారుతున్నాయని చెప్పుకోవడం.. బాధాకరమన్నారు. రాష్ట్ర నిధులు.. నీళ్లు దోపిడీకి గురి అవుతున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu