రాజ్యాంగంపై వ్యాఖ్యలు.. నియంతలకే ఆ ఆలోచనలు, కేసీఆర్‌ను సీఎంగా తొలగించాలి: భట్టి విక్రమార్క

Siva Kodati |  
Published : Feb 04, 2022, 05:00 PM IST
రాజ్యాంగంపై వ్యాఖ్యలు.. నియంతలకే ఆ ఆలోచనలు, కేసీఆర్‌ను సీఎంగా తొలగించాలి: భట్టి విక్రమార్క

సారాంశం

రాచరికం కోరుకునే వాళ్లే రాజ్యాంగం వద్దని అంటారంటూ తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. ఇంత ప్రమాదకరమైన స్టేట్‌మెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనంటూ ఆయన ఫైర్ అయ్యారు. రాజ్యాంగం పనికి రాదని చెప్పిన కేసీఆర్‌ను సీఎంగా తొలగించాలని భట్టి డిమాండ్ చేశారు  

దేశానికి కొత్త రాజ్యాంగం ( new constitution) అవసరమన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు (kcr) దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం టీ కాంగ్రెస్ (congress) ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో నిరసన దీక్ష జరిగింది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క (bhatti vikramarka) మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రమాదకరమైన స్టేట్‌మెంట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు హక్కులు కల్పించిన పవిత్ర గ్రంథం రాజ్యాంగమని భట్టి విక్రమార్క అన్నారు. మహిళలకు సైతం సమాన హక్కులు కల్పించిందని ఆయన గుర్తుచేశారు. 

రాజ్యాంగం అంటే రిజర్వేషన్ ఒక్కటే కాదని.. జీవన విధానమని భట్టి అన్నారు. ప్రతి ఒక్కరికి ఓటు హక్కు, జీవించే హక్కులను రాజ్యాంగం కల్పించిందని ఆయన గుర్తుచేశారు. రాజ్యాంగం లేకుంటే పాలనలో మనకు భాగస్వామ్యం వుండేది కాదని విక్రమార్క అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం పనికి రాదు అని చెప్పడం అంటే నియంత ఆలోచనే అంటూ ఆయన దుయ్యబట్టారు. రాచరికం కోరుకునే వాళ్లే రాజ్యాంగం వద్దని అంటారంటూ భట్టి ఎద్దేవా చేశారు. ఇంత ప్రమాదకరమైన స్టేట్‌మెంట్ ఇచ్చిన వ్యక్తి కేసీఆర్ ఒక్కరేనంటూ ఆయన ఫైర్ అయ్యారు. 

ప్రజలకు హక్కులు వద్దనే మాటలు రాజులు మాత్రమే చెబుతారంటూ భట్టి ఆరోపించారు. నేను మాత్రమే రాజ్యం ఏలాలి అనుకునే వ్యక్తుల్లో కేసీఆర్ ఒకరని విక్రమార్క దుయ్యబట్టారు. రాజ్యాంగం పనికి రాదని చెప్పిన కేసీఆర్‌ను సీఎంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు రాష్ట్రపతి, గవర్నర్ చొరవ చూపాలని భట్టి కోరారు. రాజ్యాంగం గురించి తప్పుడు మాటలు మాట్లాడిన కేసీఆర్‌ను ఏం చేసినా తప్పులేదని ఆయన వ్యాఖ్యానించారు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి సీఎం అయిన కేసీఆర్ ఇప్పుడు రాజ్యాంగం పనికిరాదని చెబుతున్నారంటూ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మరోవైపు రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం KCR వ్యాఖ్యలను నిరసిస్తూ New Delhi లోని తెలంగాణ భవన్ ఆవరణలోని Ambedkarవిగ్రహం వద్ద BJP  తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు Bandi Sanjay  గురువారం నాడు మౌన దీక్షకు దిగారు. ఈ దీక్షకు  ‘బీజేపీ బీమ్ దీక్ష’ అని పేరు పెట్టింది. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయంబాబూరావు, పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారులు వెదిరె శ్రీరాం, రాష్ట్ర సమన్వయకర్త నూనె బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మార్చాలని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ ఉపసంహరించుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై కేసీఆర్ ప్రజలకు క్షమానణ చెప్పాలని ఆయన కోరారు.  అహంకారపూరితంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు కారణమయ్యాయని సంజయ్ విమర్శించారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్