అనర్హత వేటు.. ఉడుత ఊపులకు రాహుల్ గాంధీ భయపడరు : భట్టి విక్రమార్క

Siva Kodati |  
Published : Mar 24, 2023, 07:37 PM IST
అనర్హత వేటు.. ఉడుత ఊపులకు రాహుల్ గాంధీ భయపడరు : భట్టి విక్రమార్క

సారాంశం

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై లోక్‌సభ కార్యాలయం అనర్హత వేటు వేసిన నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. కేసులకు రాహుల్ గాంధీ భయపడరని ఆయన స్పష్టం చేశారు.   

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై లోక్‌సభ కార్యాలయం అనర్హత వేటు వేసిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. తాజాగా తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఇలాంటి ఉడుత ఊపులకు రాహుల్ భయపడరని అన్నారు. రాహుల్‌పై సూరత్‌లో తప్పుడు కేసు పెట్టించారని.. మోడీ అసలు స్వరూపం బయటపడిందన్నారు. కేసులకు రాహుల్ గాంధీ భయపడరని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. 

కాగా..సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీపై ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. పార్లమెంటు నుంచి ఆయనను డిస్‌క్వాలిఫై చేశారు. 2019 క్రిమినల్ డిఫమేషన్ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. అయితే, అనర్హత వేటు మాత్రం తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్ పేర్కొనడం గమనార్హం. 

ALso REad: రాహుల్ గాంధీ ముందున్న దారులేమిటీ? 8 ఏళ్లు ఎన్నికలకు దూరమేనా? కోర్టులో పిటిషన్ వేస్తారా?

ఈ రోజు లోక్‌సభ సెక్రెటేరియట్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. అందులో రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు పడినట్టు వివరణ ఉన్నది. కేరళలోని పార్లమెంటు వయానాడ్ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడిందని ఆ నోటిఫికేషన్ పేర్కొంది. ఈ అనర్హత మార్చి 23వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు వివరించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8 ప్రకారం, ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.

ఇదిలావుండగా.. 2019లో కర్ణాటకలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోడీ కోర్టును ఆశ్రయించారు. ఆర్థిక నేరస్తులను పేర్కొంటూ వీరిందరి ఇంటి పేరు మోడీ అనే ఎందుకు ఉంటున్నది? అంటూ రాహుల్ గాంధీ మాట్లాడారు. దీంతో మోడీ ఇంటి పేరున్న పూర్ణేశ్ మోడీ సూరత్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రిమినల్ డిఫమేషన్ కేసు విచారించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా తేల్చింది. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, ఆయన ఈ తీర్పును పై కోర్టులో సవాల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. 30 రోజుల పాటు ఆ శిక్షను సస్పెండ్ చేస్తూ రాహుల్ గాంధీకి అవకాశం కల్పించింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?