
తెలంగాణకు చెందిన ఓ రెండో తరగతి విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసు స్టేషన్‌కువెళ్లి టీచర్‌పై ఫిర్యాదు చేశాడు. టీచర్‌ను అరెస్ట్ చేయాలని పోలీసులను కోరాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. బయ్యారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో అనిల్ నాయక్ అనే విద్యార్థి రెండో తరగతి చదువుతున్నాడు. అయితే తన టీచర్ కొద్ది రోజులుగా కొడుతున్నాడని ఆరోపిస్తూ అతడు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. టీచర్ తనను తెగ కొడుతున్నాడని.. అతడిని అరెస్ట్ చేయాలని పోలీసులను కోరాడు.
అనిల్ నాయక్ పోలీస్ స్టేషన్‌కు రావడంతో.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్ రమాదేవి ఎందుకు ఇక్కడికి వచ్చావని ప్రశ్నించారు. దీంతో తన టీచర్ కొడుతున్నాడని అనిల్ బదులిచ్చాడు. అయితే టీచర్ ఎందుకు కొడుతున్నాడని అడగ్గా.. తాను సరిగా చదవనందుకు అని బాలుడు చెప్పాడు. దీంతో ఇన్‌స్పెక్టర్ రమాదేవి.. స్కూల్ ఇతర విద్యార్థులను కూడా టీచర్ కొడుతున్నారా అని ఆరా తీశారు. ఇందుకు బాలుడు.. లేదని సమాధానమిచ్చాడు. తనను ఒక్కడినే టీచర్ కొట్టాడని చెప్పారు.
దీంతో షాక్‌కు గురైన లేడీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రమాదేవి.. బాలుడి చెప్పిన విషయాలను ఓపికగా విన్నారు. ఆ తర్వాత సమస్యను పరిష్కరించేందుకు మళ్లీ పాఠశాలకు తీసుకెళ్లారు. కౌన్సెలింగ్ అనంతరం ఈ సమస్య సద్దుమణిగింది.