లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి: వర్షాలపై కలెక్టర్లతో తెలంగాణ సీఎస్ వీడియో కాన్ఫరెన్స్

By narsimha lode  |  First Published Jul 10, 2022, 4:59 PM IST

 రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో చెరువులు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల వద్ద రక్షణ  చర్యలు చేపట్టాలని తెలంగాన సీఎస్ సోమేష్ కుమార్ కోరారు.ఇవాళ మధ్యాహ్నం జిల్లాల కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.


హైదరాబాద్: Telangana రాష్ట్రంలో Heavy Rains కురుస్తున్న నేపథ్యంలో చెరువులు, కల్వర్టలు, లోతట్టు ప్రాంతాల వద్ద సురక్షిత చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్  అధికారులను ఆదేశించారు.

తెలంగాణ  రాష్ట్రంలో గత మూడు రోజులుగా వర్షాలు  కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో  జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి Somesh Kumar ఆదివారం నాడు  వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. బూర్గుల రామకృష్ణారావు భవన్ నుండి ఆయన జిల్లాల అధికారులతో వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

Latest Videos

undefined

మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే  అవకాశం ఉన్నందున సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేయాలని Chief Secretary  సూచించారు. సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని అదేవిధంగా ప్రతీ జిల్లా కలెక్టరేట్ లలో కూడా ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 రాష్ట్రంలోని  అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని ముఖ్యంగా ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, భూపాల పల్లి, ములుగు జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు.

ఆయా జిల్లాల Collectors  మరింత అప్రమత్తంగా ఉండాలని CS కోరారు.. ఇప్పటికే నిండిన అన్ని చెరువులు, కుంటల వద్ద ముందు జాగ్రత్తగా ఇసుక బస్తాలు ఏర్పాటు చేసుకోవాలని సోమేష్ కుమార్ సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు.ఎక్కడైనా రోడ్లు దెబ్బతింటే వెంటనే పునరుద్దరించాలసిందిగా కోరారు. 

 గ్రామాల్లోని మంచినీటి ట్యాంకులను పరిశుభ్రం చేయాలన్నారు.  అంటువ్యాధులు ప్రబలకుండా తగు రసాయన పదార్థాలను సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎస్ కోరారు.

also read:తెలంగాణలో భారీ వర్షాలు: విద్యాసంస్థలకు మూడు రోజుల సెలవులు

    ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఇంధన శాఖ, మున్సిపల్ పరిపాలన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, అరవింద్ కుమార్ లతో పాటు అడిషనల్ డీజీ జితేందర్,పంచాయితీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, జీహెచ్ఎంసీ కమీషనర్ లోకేష్ కుమార్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, ఈఎన్ సీలు మురళీధర్, గణపతిరెడ్డి లు పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున  విద్యా సంస్థలకు మూడు రోజుల పాటు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదివారం నాడు మధ్యాహ్నం వర్షాలపై సమీక్ష నమావేశం నిర్వహించారు. అందుబాటులో ఉన్న మంత్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.  రాష్ట్రంలో ఇప్పటికే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణకు భారత వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసిన నేపథ్యంలో సీఎం సమీక్ష నిర్వహిస్తున్నారు.

click me!