క్యాంప్ కార్యాలయంగా ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ: పరిశీలించిన రేవంత్ రెడ్డి

By narsimha lodeFirst Published Dec 10, 2023, 3:56 PM IST
Highlights


ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ భవనాన్ని క్యాంప్ కార్యాలయంగా మార్చుకోవాలని తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.ఇవాళ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ కార్యాలయాన్ని పరిశీలించారు. 


హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ  కార్యాలయాన్ని  తెలంగాణ సీఎం అనుముల రేవంత్ రెడ్డి  తన క్యాంప్ కార్యాలయంగా  మార్చుకొనే అవకాశం ఉంది. 

ప్రగతి భవన్ ను  డాక్టర్ జ్యోతిరావుపూలే  ప్రజాభవన్ గా మార్చారు. ప్రతి రోజూ ఇక్కడ  ప్రజా దర్బార్ ను నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు  ఉదయం  10 గంటల నుండి  గంట పాటు  ప్రజల నుండి వినతులు స్వీకరించనున్నారు. 

Latest Videos

సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత తన స్వంత ఇంట్లోనే రేవంత్ రెడ్డి ఉంటున్నారు.  అయితే  ఎంసీహెచ్‌ఆర్‌డీని  క్యాంప్ కార్యాలయంగా మార్చుకోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.  ఆదివారంనాడు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ కార్యాలయాన్ని రేవంత్ రెడ్డితో పాటు కొందరు మంత్రులు పరిశీలించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లో ఉన్నారు. తన నివాసాన్ని ప్రగతి భవన్ గా మార్చుకున్నారు.  

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి కూడ ప్రగతి భవన్ లోనే ఉన్నారు.  తెలంగాణ సీఎం గా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రగతి భవన్ లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. 
ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చినందున  క్యాంప్ కార్యాలయంగా  మరో కార్యాలయాన్ని రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు.  రేవంత్ రెడ్డి, సీతక్క, అధికారులతో కలిసి   ఎంసీహెచ్‌ఆర్‌డీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ భవనాన్ని  క్యాంప్ కార్యాలయంగా ఉపయోగించుకుంటే  ట్రాఫిక్ సమస్య ఉండదని సీఎం భావిస్తున్నారు. 

ఎంసీహెచ్ఆర్‌డీని  క్యాంప్ కార్యాలయంగా మార్చుకొనే విషయమై  సీఎం పరిశీలిస్తున్నారు.  ఈ కార్యాలయానికి భద్రతతో పాటు ఇతర అంశాలను కూడ అధికారులు పరిశీలించనున్నారు. ఎంసీహెచ్‌ఆర్‌డీలోని కార్యాలయాలను  ప్రగతి భవన్ కు తరలించాలని భావిస్తున్నారు. 

సచివాలయం నుండి పాలన సాగిస్తామని  కాంగ్రెస్ ప్రకటించింది.  గతంలో  కేసీఆర్ సచివాలయానికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజునే  సచివాలయానికి సీఎం కేసీఆర్ వెళ్లారు.  అదే రోజున కేబినెట్ సమావేశం నిర్వహించారు.ఈ నెల  8న  విద్యుత్ శాఖపై  సీఎం రేవంత్ రెడ్డి  సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.

also read:కేసీఆర్‌కు పరామర్శ: వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బాటలోనే రేవంత్

నగరం మధ్యలో క్యాంప్ కార్యాలయం ఉంటే ట్రాఫిక్ సమస్యలుంటాయని  సీఎం  భావిస్తున్నారు. ఎంసీహెచ్ఆర్‌డీని క్యాంప్ కార్యాలయంగా మార్చుకొంటే సామాన్యులకు కూడ ట్రాఫిక్ కష్టాలు తీరుతాయనే అభిప్రాయంతో  ముఖ్యమంత్రి ఉన్నారు.  ఈ కారణంగానే ఎంసీహెచ్ఆర్‌డీ కార్యాలయాన్ని  సీఎం ఇవాళ పరిశీలించారు.

click me!