గవర్నర్ తో కేసీఆర్ భేటీ

Published : Dec 29, 2018, 10:27 PM IST
గవర్నర్ తో కేసీఆర్ భేటీ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం అనంతరం సీఎం నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణ నివాసానికి వెళ్లి కలిశారు. 

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ప్రగతిభవన్‌లో మీడియా సమావేశం అనంతరం సీఎం నేరుగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణ నివాసానికి వెళ్లి కలిశారు. 

ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లారు. గవర్నర్‌ నరసింహన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర మంత్రివర్గం, శాసనసభ్యుల ప్రమాణస్వీకారం, ఉమ్మడి హైకోర్టు విభజన వంటి పలు అంశాలపై చర్చించారు. దాదాపు గంటకు పైగా సీఎం, గవర్నర్‌ మధ్య అంతర్గత చర్చలు జరిగాయి. 

PREV
click me!

Recommended Stories

Top 5 Cleanest Railway Stations : దేశంలో అత్యంత పరిశుభ్రమైన రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?