నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి (Nagarkurnool former MLA Marri Janardhan Reddy)పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్ ఉల్లంఘన ( Protocol violation) జరిగిందని ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి (MLA Kuchukulla Rajesh Reddy) ఆరోపించారు.
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి తన సొంత డబ్బులతో నిర్మించిన స్కూల్ ప్రారంభోత్సవంతో ప్రొటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అసలేం జరిగిందంటే.. ?
నాగర్‌కర్నూల్ జిల్లా తాడూర్ మండలంలోని సిర్శావాడ గ్రామంలో బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి స్కూల్ నిర్మించారు. తన ఎంజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 కోట్ల 50 లక్షలతో తాను చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కొత్త భవనాన్ని కట్టించారు. దీని నిర్మాణం చాలా నెలల కిందట ప్రారంభం కాగా.. తాజాగా పూర్తయ్యింది.
దీంతో ఆ భవనాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అయితే ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులకు ఆగ్రహం తెప్పించింది. ప్రభుత్వ పాఠశాల స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించాల్సి ఉన్న మాజీ ఎమ్మెల్యేతో ఎలా ప్రారంభించడానికి అనుమతి ఇస్తారని ఎమ్మెల్యే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి మీద కేసు నమోదు చేసిన పోలీసులు
నాగర్ కర్నూల్ పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ రగడ.
ఎమ్మెల్యే కాకుండా మాజీ ఎమ్మెల్యేను ఎలా ప్రారంభించడానికి అనుమతిస్తారు అంటూ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఆగ్రహం.
ప్రభుత్వ అధికారి డీఈఓ మీద దాడికి యత్నించిన… https://t.co/o9OSLZd6Sr pic.twitter.com/aHMXuQYLiL
ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆయన తీవ్ర అసహంన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ నాయకులు డీఈవోపై దాడికి యత్నించగా.. ఇందులో తన తప్పేం లేదంటూ దండం లేదని ఆయన విన్నవించారు. దీంతో పోలీసులు డీఈవోకు ప్రొటక్షన్ ఇచ్చి, అక్కడి నుంచి పంపించారు.