అందుకే ఫలితాల వెల్లడి ఆలస్యం.. కౌంటింగ్‌లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదన్న సీఈవో వికాస్‌రాజ్

By Sumanth KanukulaFirst Published Nov 6, 2022, 12:30 PM IST
Highlights

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల జాప్యం జరుగుతుందంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజు స్పందించారు. కౌంటింగ్‌లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని వెల్లడించారు. 

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల జాప్యం జరుగుతుందంటూ వస్తున్న వార్తలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజు స్పందించారు. కౌంటింగ్‌లో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని వెల్లడించారు. కౌంటిగ్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. ప్రతి టేబుల్ మీద ప్రతి అభ్యర్థికి చెందిన ప్రతినిధులు ఉన్నారని అన్నారు. ఎలాంటి అవకతవకలు జరగడానికి అవకాశం జరగడానికి అవకాశం లేదన్నారు. ఆర్వో సంతకం చేసిన తర్వాతే ఫలితాలు  వెల్లడిస్తున్నట్టుగా తెలిపారు. ప్రతి రౌండ్‌ కౌంటింగ్‌కు అరగంట కంటే ఎక్కువ సమయం పడుతుందని అన్నారు. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం వల్లే ఆలస్యం అవుతుంది. 

ఇదిలా ఉంటే.. మునుగోడు:  మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడి అనుమానాస్పదంగా ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్  రాజుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్  విమర్శలు గుప్పించారు. ఈ  మేరకు ఇవాళ ఆయన ఓ పత్రిక  ప్రకటనను విడుదల  చేశారు. టీఆర్ఎస్కి లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం  లేదని బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీకి లీడ్ వచ్చినప్పటికీ ఫలితాలను వెల్లడించడం లేదని ఆయన  ఆరోపించారు.

మొదటి, రెండు రౌండ్ల తరువాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్ డేట్ చేసేందుకు జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.మీడియా నుండి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని  ఆయన ప్రశ్నించారు.  ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు.

మరోవైపు మునుగోడు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రక్రియపై స్పందించిన తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల పరిశీలకులు ఫలితాల వెల్లడిలో ఆలస్యం చేస్తున్నారనే తమ అభ్యర్థి సమాచారం ఇచ్చారని చెప్పారు.

కౌంటింగ్ సరిగా జరిగానే తర్వాతనే ఫలితాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఫలితాలపై బీజేపీ నాయకులు ఎన్నికల అధికారులు ఇచ్చినట్టుగా తప్పుడు సమాచారం ఇచ్చి.. ప్రజలను గందరగోళపరిచే ప్రయత్నం చేస్తున్నారని  ఆరోపించారు. ప్రతి రౌండ్ లెక్కింపు పూర్తయ్యాక అధికారులే మీడియాకు వివరాలు వెల్లడించాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల అధికారులకు కేంద్ర మంత్రి ఫోన్ చేయడం ఎంతవరకు సరైనదని ప్రశ్నించారు. బీజేపీవి మొదటి నుంచి తప్పుడు విధానాలేనని ఆరోపించారు. వాళ్లు అనుకున్న స్థాయిలో ఓట్లు రాలేదని బీజేపీ అభ్యర్థే చెప్పారని అన్నారు. ఇక, మునుగోడు ప్రజలు ధర్మం వైపు, న్యాయం వైపే ఉన్నారని అన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

click me!