తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం... క్లారిటీ ఇచ్చిన ఎన్నికల ప్రధానాధికారి

Published : May 03, 2023, 04:53 PM ISTUpdated : May 03, 2023, 05:05 PM IST
తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం... క్లారిటీ ఇచ్చిన ఎన్నికల ప్రధానాధికారి

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయంటూ జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ స్పందించారు. 

హైదరాబాద్ : గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నకలకు వెళ్లే ఆలోచనలో వున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్వయంగా కేసీఆరే ముందస్తు ఎన్నికలపై పోబోమని... పూర్తికాలం బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వుంటుందని స్ఫష్టం చేసారు. అయితే ముందస్తు ఎన్నికలంటూ ప్రచారం కొనసాగుతూనే వుంది. దీంతో స్వయంగా తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడుంటాయో క్లారిటీ ఇచ్చారు. 

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సన్నద్దత, ఓటర్ల జాబితాకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రతినిధులతో వికాస్ రాజ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని కొట్టిపారేస్తూ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయన స్ఫష్టం చేసారు. ఈ ఏడాది చివర్లో నవంబర్ లేదా డిసెంబర్ లో ఎన్నికల జరిగే అవకాశాలున్నాయని తెలిపారు. 

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఎన్నికలకు సంబంధించిన కసరత్తు ప్రారంభించినట్లు సిఈవో తెలిపారు. ఎన్నికల నాటికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసేందుకు సన్నాహకాలు చేపట్టినట్లు తెలిపారు. ఇందుకోసమే రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయినట్లు ఎన్నికల అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. 

Read More  రాజకీయాల్లోకి వస్తున్నా... సీఎం కేసీఆర్ పైనే పోటీ..: గద్దర్ సంచలన ప్రకటన

ఇదిలావుంటే ఇప్పటికే సీఎం కేసీఆర్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముందస్తు ఎన్నికలకు పోయే ఆలోచన లేదని ఇప్పటికే తేల్చేసారు. అయితే టీఆర్ఎస్‌ఎల్పీ, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లడంలేదంటూనే ఎన్నికలకు సన్నద్దం కావాలని కేసీఆర్ సూచించారు. దీంతో ప్రతిపక్షాలు అప్రమత్తంగా కాకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదంటూ కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారంటూ రాజకీయ చర్చ జరిగింది. తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులకు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సన్నద్దంగా వుండాలంటూ ముందస్తుపై హింట్ ఇచ్చారని... ఖచ్చితంగా తెలంగాణలో నిర్ణీత సమయం కంటే ముందుగానే ఎన్నికలు జరుగుతాయన్న చర్చ జోరుగా సాగింది. 

ఇక మంత్రి కేటీఆర్ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్ళే అవసరం తమకు లేదని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100కు పైగా సీట్లలో బిఆర్ఎస్ విజయం సాధిస్తుందని... కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయి హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. ఇలా గతంలో కేసీఆర్, కేసీఆర్ ముందస్తు ఎన్నికల ప్రచారాన్ని కొట్టిపారేయగా తాజాగా స్వయంగా ఎన్నికల ప్రధాన అధికారి దీనిపై క్లారిటీ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్