కొడంగల్ ఐటీ దాడులపై సీల్డ్ కవర్ నివేదిక...: రజత్ కుమార్

By Arun Kumar PFirst Published Nov 29, 2018, 3:19 PM IST
Highlights

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. ఇక్కడి నుండి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో అతన్ని ఓడించడానికి టీఆర్ఎస్ మంత్రి  మహేందర్ రెడ్డి తమ్ముడు నరేందర్  రెడ్డి వంటి గట్టి లీడర్ ను బరిలోకి దించింది. 
 

తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల్లో కొడంగల్ ఒకటి. ఇక్కడి నుండి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటంతో అతన్ని ఓడించడానికి టీఆర్ఎస్ మంత్రి  మహేందర్ రెడ్డి తమ్ముడు నరేందర్  రెడ్డి వంటి గట్టి లీడర్ ను బరిలోకి దించింది. 

అయితే ఎన్నికలు సమీపించిన సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి బందువుకు చెందిన పామ్ హౌస్ లో భారీ డబ్బులు పట్టుబడటం తీవ్ర కలకలం రేగుతోంది. కొడంగల్ సమీపంలో వున్న జగన్నాథరెడ్డి అనే వ్యక్తి ఫామ్ హౌస్ పై బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.  స్థానిక పోలీసుల సాయంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేపట్టగా భారీగా దాచిన డబ్బుతో పాటు కొన్ని రశీదులు లభించినట్లు సమాచారం.  

ఈ ఐటీ దాడులపై తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ స్పందించారు. ఇప్పటికే తాము ఐటీ అధికారుల నుండి  ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తీసుకున్నట్లు తెలిపారు. అయితే వారు వివరాలతో కూడిన సమాచారాన్ని ఓ సీల్డ్ కవర్ లో నివేదిక రూపంలో ఇచ్చారని దాన్ని ఇంకా పరిశీలించాల్సి ఉందన్నారు. వాటిని పరిశీలించిన వెంటనే వివరాలను వెల్లడిస్తామని రజత్ కుమార్ తెలిపారు.  

ఎన్నికల సందర్భంగా పోలీసులు, ఈసీ అధికారులు, ప్లయింగ్ స్వాడ్స్ ఎలాంటి అక్రమాలు జరక్కుండా చేపడుతున్న తనిఖీల్లో ఇప్పటివరకు రూ.104 కోట్లు పట్టుబడినట్లు రజత్ కుమార్ వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న ఈ డబ్బుకు సంబంధించి సరైన ఆధారాలు చూపించిన వారికి తిరిగి ఇస్తామన్నారు. ఎవరిపై  ఎలాంటి వివక్ష చూపకుండా మంత్రులు, వీఐపిలతో సహా సామాన్యుల వాహనాలను కూడా తనిఖీ చేసిన తర్వాతే వదులుతున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు రజత్ కుమార్ వెల్లడించారు.

మరిన్ని  వార్తలు

కొడంగల్ లో భారీ నగదు పట్టివేత...టీఆర్ఎస్ అభ్యర్థి బంధువు ఫామ్‌హౌస్‌లో...
 

click me!