
ఈ నెల 9న తెలంగాణ మంత్రిమండలి సమావేశం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా బడ్జెట్‌లో ఆమోదించిన పలు పథకాలు, గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి మంత్రి మండలి చర్చించనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత జరుగుతున్న కేబినెట్ భేటీ కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.