ఈ నెల 11న తెలంగాణ కేబినెట్ భేటీ: నిధుల సమీకరణపై చర్చ

By narsimha lodeFirst Published Aug 9, 2022, 3:21 PM IST
Highlights

తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 11న నిర్వహించనున్నారు. రాష్ట్రానికి నిధుల సమీకరణ విషయమై  ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. 

హైదరాబాద్: ఈ నెల 11న Telangana Cabinet సమావేశం జరగనుంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణతో పాటు ఇతర కీలక అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.  ఈ నెల 11న మధ్యాహ్నాం మూడు గంటలకు ప్రగతి భవన్ లో జరగనుంది.  సీఎం KCR అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.  

రూ.1500 కోట్లు రాష్ట్రానికి నిధులు అవసరం ఉంది. రాష్ట్రానికి FRBM పరిధి మేరకు  అప్పులు తెచ్చుకొనేందుకు అవకాశం ఇవ్వాలని  కూడా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. కార్పోరేషన్లు తీసుకున్న అప్పులను కూడా రాష్ట్రప్రభుత్వం అప్పులుగా పరిగణిస్తామని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకొనే విషయంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ విషయమై కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఈ నెల 11న జరిగే కేబినెట్ సమావేశంలో  రాష్ట్రానికి నిధుల విషయమై చర్చించనున్నారు.

త్వరలో Munugode bypoll అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మునుగోడు నియోజకవర్గంలో  చేపట్టాల్సిన అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన అంశాలపై  కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే లోపుగా ఈ నియోజకవర్గంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై  కూడా ప్రభుత్వం కేంద్రీకరించింది. ఈ నెల 7న ఢిల్లీలో జ,రిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని కేసీఆర్ బహిష్కరించారు.అయితే ఈ నెల 6వ తేదీన నీతి ఆయోగ్ సమావేశం బహిష్కరించేందుకు గల కారణాలను సీఎం కేసీఆర్ వివరించారు రాష్ట్రాలు అప్పులు తీసుకొనే విషయమై కేంద్ర ప్రభుత్వం  విధించిన ఆంక్షలతో  రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు  శతృ దేశాలపై విధించిన తరహాలో ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు గతంలోనే కేంద్రం తీరుపై విమర్శలు చేశారు.

click me!