తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు.. భద్రాచలం వద్ద మరోసారి గోదారమ్మ ఉగ్రరూపం

By Siva KodatiFirst Published Aug 9, 2022, 2:31 PM IST
Highlights

గోదారమ్మ మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం దగ్గర 40.2 అడుగులకు చేరింది నీటిమట్టం. ఇది 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. 

గోదారమ్మ మరోసారి ఉగ్రరూపం దాలుస్తోంది. నదిలో వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. భద్రాచలం దగ్గర 40.2 అడుగులకు చేరింది నీటిమట్టం. ఇది 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ధవళేశ్వరం నుంచి 6 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేయనున్నారు. 

కాగా.. Telangana రాష్ట్రంలో మంగళవారం నాడు భారీ నుండి అతి Heavy Rains కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. దీంతో భారీ వర్షాలు కురిసే జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది IMD. బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతుంది. మరికొన్ని గంటల్లో అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

Also Read:నేడు తెలంగాణలో భారీ వర్షాలు: ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్

నైరుతి రుతు పవనాలు ప్రవేశంతోనే Telangana రాష్ట్రంలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. నైరుతి రుతు పవనాలు ప్రవేశించిన రోజు నుండి రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని గంటల పాటు మాత్రమే వర్షం తెరిపిని ఇస్తుంది. ఇటీవలనే Godavari నదికి భారీగా వరద పోటెత్తింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా గత 100 ఏళ్లలో రాని వరద గోదావరి నదికి వచ్చింది.దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించారు.

వరదల వల్ల రూ. 1400 కోట్ల నష్టం వాటిల్లింది. అంతేకాదు 14 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయమై తమకు సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. రాష్ట్రంలో కేంద్ర బృందం కూడా పర్యటించి వరద నష్టంపై అంచనా వేసింది. మరో వైపు గత మాసంలో  ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ వరద నష్టంపై కేంద్ర మంత్రులు, వీలైతే ప్రధాని మోడీని కలుస్తారని ప్రచారం సాగింది. అయితే న్యూఢిల్లీలో ఐదు రోజుల పాటు గడిపిన సీఎం కేసీఆర్ కేంద్రమంత్రుల, ప్రధానిని కలవకుండానే వెనుదిరిగారు. ఈ విషయమై బీజేపీ నేతలు కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. 

click me!