మునుగోడుపై బీజేపీ ఫోకస్: ఈ నెల 22 నుండి కీలక నేతలంతా అక్కడే

By narsimha lodeFirst Published Aug 9, 2022, 2:37 PM IST
Highlights

ఈ నెల 22 నుండి మునుగోడు అసెంబ్లీ స్థానంలోనే బీజేపీ నేతలు ప్రచారం నిర్వహించనున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదించిన విషయం తెలిసిందే. 

మునుగోడు:మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికపై BJP  నాయకత్వం ఫోకస్ పెట్టింది.ఈ నెల 22 వ తేదీ నుండి బీజేపీ కీలక నేతలంతా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. 

Munugode Bypoll  ఎమ్మెల్యే పదవికి Komatireddy Rajagopal Reddy రాజీనామా చేశారు.నిన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి MLA పదవికి రాజీనామా చేయడంతో ఈ రాజీనామా పత్రాన్ని స్పీకర్ ఆమోదించారు. మునుగోడు అసెంబ్లీ స్థానం ఖాళీ అయిందని ఎన్నికల సంఘానికి సమాచారం పంపారు. దీంతో ఆరు మాసాల్లోపుగా మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగడం అనివార్యం. దీంతో మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ పట్టుదలగా ఉంది. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న బీజేపీలో చేరనున్నారు. చౌటుప్పల్ లో నిర్వహించే బహిరంగ సభలో  కేంద్ర మంత్రి Amit Shah పాల్గొంటారు.ఈ సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.
ఈ నెల 22 వ తేదీ నుండి బీజేపీ  కీలక నేతలు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోనే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు. మునుగోడు అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జీ బాధ్యతలను మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి అప్పగించే అవకాశాలు లేకపోలేదు. దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో జితేందర్ రెడ్డే బీజేపీ ఎన్నికల ఇంచార్జీగా కొనసాగారు. ఈ సెంటిమెంట్  బీజేపీకి కలిసి వచ్చింది. ఈ రెండు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. 

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో విజయం సాధించడం ద్వారా TRS  Congress లకు ఒకేసారి చెక్ పెట్టాలని కమలదళం ప్లాన్ చేస్తోంది. వ,చ్చే ఏడాదిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు జరిగే మునుగోడు ఉప ఎన్నికలు సెమీ ఫైనల్ గా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. మరో వైపు టీఆర్ఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు కూడా ఆ పార్టీకి రాజీనామా చేస్తారని కూడా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇటీవల ప్రకటించారు. ఒకవేళ అదే జరిగితే  ఈ స్థానాలకు కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ నెల 21వ తేదీన  చౌటుప్పల్ లో జరిగే సభతోనే మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారానికి బీజేపీ నాయకత్వం తెర లేపనుంది. 

also read:మునుగోడులో గెలిస్తే 2023లో మాదే అధికారం: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని నాలుగు మండలాలలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లేందుకు నిర్ణయం తీసుకొన్నారు. దీంతో ఈ నలుగురిపై కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాడర్ ను తన వైపునకు తిప్పుకొనేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ  కాంగ్రెస్ క్యాడర్ ను కాపాడుకొనేందుకు  టీపీసీసీ నాయకత్వం కూడా చర్యలు చేపట్టింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల స్ట్రాటజీ కమిటీ ఇప్పటికే నియోజకవర్గంలో మకాం వేసింది. మునుగోడులో తన పట్టును నిలుపుకొనేందుకు గాను కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తు చేస్తోంది. ఈ స్థానంలో విజయం సాదించి బీజేపీ, కాంగ్రెస్ లకు కూడా చెక్ పెట్టాలని కూడా అధికార పార్టీ భావిస్తుంది.
 

click me!