ఈ నెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం: బడ్జెట్ ఆమోదించనున్న మంత్రివర్గం

By narsimha lodeFirst Published Feb 2, 2023, 8:57 PM IST
Highlights

ఈ నెల 5వ తేదీన తెలంగాణ  కేబినెట్ సమావేశం  నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో  తెలంగాణ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.  
 

హైదరాబాద్: ఈ నెల 5వ తేదీన  ఉదయం  పదిన్నర గంటలకు  తెలంగాణ కేబినెట్ సమావేశం  నిర్వహించనున్నారు.   ఈ నెల  6వ తేదీన  అసెంబ్లీలో  బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది ప్రభుత్వం.. ఈ బడ్జెట్ కు  తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి నుండి  ప్రారంభం కానున్నాయి.  గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  ప్రసంగంతో  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.గత ఏడాది గవర్నర్ ప్రసంగం  లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కానీ  ఈ దఫా మాత్రం  గవర్నర్ ప్రసంగంతో  బడ్జెట్  సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య  గత నెల  30వ తేదీన  సయోధ్య కుదిరింది.  ఈ సయోధ్య నేపథ్యంలో  రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి  రాజ్ భవన్ కు  వెళ్లి గవర్నర్ తమిళిసై  సౌందర రాజన్  అసెంబ్లీ సమావేశాల్లో  పాల్గొనాలని ఆహ్వానించారు. . గవర్నర్ వద్ద ఉన్న బడ్జెట్ కు  తమిళిసై ఆమోదం తెలిపారు. గత నెల  30వ తేదీన  బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని  తెలంగాణ ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ చేసిన సమయంలో హైకోర్టు ఇరు వర్గాల న్యాయవాదులు కూర్చొని చర్చించుకోవాలని సలహ ఇచ్చింది.  లంచ్ బ్రేక్ సమయంలో ఇరువర్గాల మధ్య  సామరస్యపూర్వకమైన సయోధ్య కుదిరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లంచ్ మోషన్ పిటిషన్ ను వెనక్కి తీసుకుంది. 
 

click me!