ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ: కీలక విషయాలపై చర్చ

By narsimha lode  |  First Published May 5, 2020, 3:51 PM IST

 తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సాగుతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
 


హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ సాగుతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు 1085కి చేరుకొన్నాయి. కరోనాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుంది. లాక్ డౌన్ పొడిగిస్తాారా.. అన్ని జోన్లకు దీన్ని వర్తింపజేస్తారా.. కొన్ని జోన్లకు మినహాయింపులు ఇస్తారా అనే విషయమై కేబినెట్ తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Latest Videos

undefined

Also read:నిర్మల్ జిల్లాలో ఉద్రిక్తత: మేకల కాపరి మృతి, ఉడుంపూర్ ఫారెస్ట్‌ ఆఫీస్ పై దాడి

 కేంద్ర ప్రభుత్వం గ్రీన్, ఆరంజ్ జోన్లకు లాక్ డౌన్ ఆంక్షలను సడలించింది. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల్లో ఎక్కువగా జీహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నాయి. ప్రతి రోజూ కూడ జీహెచ్ఎంసీలోనే కేసులు నమోదు అవుతున్నాయి.

కరోనా కేసులు లేని జిల్లాల్లో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఎలా ఉంటుంది, కరోనా ఎక్కువగా ఉన్న జిల్లాలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. టెన్త్ పరీక్షలతో పాటు ఎంసెట్ తో పాటు ఇతర ప్రవేశ పరీక్షలకు సంబంధించి కూడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఇక మద్యం దుకాణాల రీ ఓపెన్ తో పాటు ధరల పెంపు విషయమై కూడ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. ధాన్యం కొనుగోలులో చోటు చేసుకొన్న అవాంతరాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు.కేబినెట్ లో తీసుకొన్న నిర్ణయాలను ఆయన మీడియాకు వివరిస్తారు.
 

click me!