తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

By Siva KodatiFirst Published Feb 16, 2020, 6:35 PM IST
Highlights

తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. భూముల అమ్మకంతో నిధులను రాబట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ పరిధిలోని భూములను అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. భూముల అమ్మకంతో నిధులను రాబట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం హెచ్‌ఎండీఏ పరిధిలోని భూములను అమ్మకాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

భూముల అమ్మి రూ.10 వేల కోట్ల నిధులు సేకరించాలని డిసైడ్ అయ్యింది. ఉప్పల్ బగాయత్ తరహాలో ల్యాండ్ ఫూలింగ్‌కు వెంచర్లు వేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిలో భాగంగా మోకిళ్ల, ప్రతాప సింగారం, మేడ్చల్ జిల్లా కొర్రెములలో వెంచర్లు వేయాలని పేర్కొంది.

ఈ నెల 28న శంషాబాద్‌లో రెవెన్యూ సమ్మేళనం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో రెవెన్యూ చట్ట సవరణపై అధికారులకు అవగాహన కల్పించేలా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. 

click me!