భర్త వేధింపులు: పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్యాయత్నం

By narsimha lodeFirst Published Jul 17, 2019, 4:16 PM IST
Highlights

భర్త వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలకు విషమిచ్చి వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రికి తరలిస్తుండగా వివాహిత అంజలి మృతి చెందింది. ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

హైదరాబాద్: కుటుంబ కలహాలతో  వివాహిత ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, ఇద్దరు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.  ఈ ఘటన హైద్రాబాద్ పార్శిగుట్టలో చోటు చేసుకొంది.

ఈ ఘటనలో  తల్లి మృతి చెందగా,  ఇద్దరు పిల్లలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  భర్త  వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా వివాహిత అంజలి సూసైడ్ నోట్‌ ను రాసింది.

మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ప్రసాద్ హైద్రాబాద్‌ నగరానికి వలస వచ్చాడు. ఇక్కడే కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు.  12 ఏళ్ల క్రితం పార్శిగుట్టకు చెందిన అంజలిని వివాహం చేసుకొంది.  వీరికి అనిరుధ్, అమృత తేజ్. అనే ఇద్దరు పిల్లలున్నారు.   అంజలి ముషీరాబాద్‌లోని ప్రైవేట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. 

మద్యానికి బానిసగా మారిన ప్రసాద్ అంజలిని తరచూ వేధింపులకు గురి చేసేవాడు. మద్యానికి బానిసగా మారిన  ప్రసాద్ ఆమె జీతాన్ని కూడ తీసుకొనేవాడు. అంతేకాదు ఆమెను వేధింపులకు గురిచేశాడు. ఈ వేధింపులపై బాధితురాలు చిలకలగూడ పోలీసులను ఆశ్రయించింది. ప్రసాద్‌‌కు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ అతని వైఖరిలో మార్పు రాలేదు.  దీంతో  గత నెల 15వ తేదీన అంజలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

భర్త వేధింపులు ఆగలేదు. దీంతో ఆమె మనోవేదనకు గురైంది. మంగళవారం నాడు  బాధితురాలు  కూల్‌డ్రింక్‌లో పురుగుల మందు కలిపి పిల్లలకు ఇచ్చింది. ఆ తర్వాత తాను తాగింది. ఈ కూల్ డ్రింక్ తాగిన అంజలి పెద్ద కొడుకు వాంతి చేసుకొన్నాడు. అప్పటికే తల్లి, తమ్ముడు కూడ నురగలు కక్కి కిందపడిపోయారు.

ఇది చూసిన అంజలి పెద్ద కొడుకు స్థానికులకు సమాచారం ఇచ్చారు. స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రికి తరలిస్తుండగానే  అంజలి మృతి చెందింది. ఇద్దరి పిల్లల  పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు.

భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా బాధితురాలు  సూసైడ్ లెటర్ రాసి పెట్టింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!
Last Updated Jul 17, 2019, 4:16 PM IST
click me!