ఖమ్మం జిల్లాలో విషాదం.. వరదలో చిక్కుకున్న జాలర్లు, కాపాడటానికి వెళ్లిన డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు

Siva Kodati |  
Published : Aug 11, 2022, 07:42 PM IST
ఖమ్మం జిల్లాలో విషాదం.. వరదలో చిక్కుకున్న జాలర్లు, కాపాడటానికి వెళ్లిన డీఆర్ఎఫ్ సిబ్బంది గల్లంతు

సారాంశం

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పాలేరు చెరువులో చేపల వేటకు వెళ్లిన వారు వరదలో చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు వెళ్లిన ఇద్దరు డీఆర్ఎఫ్ సిబ్బంది నీటమునిగారు. 

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. వరదలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడటానికి వెళ్లిన ఇద్దరు డీఆర్ఎఫ్ సిబ్బంది నీట మునిగారు. పాలేరు చెరువులో చేపల వేటకు వెళ్లిన రంజిత్ అనే యువకుడు గల్లంతయ్యాడు. అతన్ని కాపాడేందుకు అధికారులు.. డీఆర్ఎఫ్ సిబ్బంది సాయం కోరారు. అధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన వెంకటేష్‌ , ప్రవీణ్‌లు చెక్ డ్యాం వద్ద వెతుకుతుండగా.. నీటి ఉద్ధృతికి ఇద్దరూ మునిగిపోయారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే గజ ఈతగాళ్లను దింపి వెతికించారు. వెంకటేష్ మృతదేహం లభ్యం కాగా.. ప్రవీణ్ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!