ప్రారంభమై న తెలంగాణ కేబినెట్ భేటీ: కీలకాంశాలపై చర్చ

By narsimha lode  |  First Published May 18, 2023, 3:37 PM IST

తెలంగాణ కేబినెట్  సమావేశం  ఇవాళ ప్రారంభమైంది.  రాష్ట్ర అవరతన  దశాబ్ది ఉత్సవాలపై  చర్చించనున్నారు. 


హైదరాబాద్: తెలంగాణ  కేబినెట్ సమావేశం గురువారంనాడు  కేసీఆర్ అధ్యక్షతన  ప్రారంభమైంది. కొత్త  సచివాలయంలో తొలిసారిగా మంత్రివర్గం  ఇవాళే  సమావేశమైంది. రాష్ట్ర ఆవిర్భావ  దశాబ్ది  ఉత్సవాల నిర్వహణపై  చర్చించనున్నారు. ఈ  ఉత్సవాలపై  మంత్రులకు  కేసీఆర్ దిశా నిర్ధేశం  చేయనున్నారు.  పోడు పట్టాలు,  గృహలక్ష్మి, ఇళ్ల పట్టాల పంపిణీ, తదితర అంశాలపై  ఈ సమావేశంలో  చర్చించనున్నారు.

గతంలో  తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  కొన్ని బిల్లులను తిప్పి పంపారు..గవర్నర్ తిప్పి పంపిన బిల్లులపై  మార్పులు చేర్పులపై  చర్చించనున్నారు . ఈ మేరకు ప్రత్యేక అసెంబ్లీ  సమావేశాల  నిర్వహణపై  చర్చించనున్నారు. అసెంబ్లీ  సమావేశాల నిర్వహణకు  సంబంధించిన తేదీలను  ఖరారు  చేసే అవకాశం లేకపోలేదు.  గృహ లక్ష్మి   పథకం  మార్గదర్శకాలపై  చర్చించనున్నారు. డబుల్ బెడ్ రూమ్ లబ్దిదారులపై  చర్చించే అవకాశం ఉంది.ప్రభుత్వాసుపత్రులు, మెడికల్ కాలేజీల్లో బోధన సిబ్బంది ఉద్యోగ విరమణ వయస్సు పెంచడానికి  మరో బిల్లుకు  కేబినెట్ ఆమోదం తెలపనుంది. మరోవైపు  మరో ఆరు మాసాల్లో  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి  ఎన్నికలు  జరగనున్నాయి.  ఎన్నికల సన్నాహక ప్రణాళికపై  కూడా  కేబినెట్ లో  చర్చించే అవకాశం లేకపోలేదు. 

Latest Videos

click me!