బజరంగ్ దళ్‌ను నిషేధించాలనే ప్లాన్‌లో కేసీఆర్.. హిందువులారా ఏకంకండి : బండి సంజయ్ వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : May 18, 2023, 02:48 PM IST
బజరంగ్ దళ్‌ను నిషేధించాలనే ప్లాన్‌లో కేసీఆర్.. హిందువులారా ఏకంకండి : బండి సంజయ్ వ్యాఖ్యలు

సారాంశం

రాష్ట్రంలో బజరంగ్ దళ్‌ను నిషేధించాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. హిందువులంతా ఏకంగా కావాలని ఆయన పిలుపునిచ్చారు.  జూన్‌లో లక్ష మందితో బీసీ గర్జన నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బజరంగ్ దళ్‌ను నిషేధించాలని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హిందువులంతా ఏకంగా కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. కేసీఆర్ బీసీల ద్రోహి అన్న ఆయన.. బీసీ రిజర్వేషన్‌లను కుదించిన చరిత్ర కేసీఆర్‌దేనంటూ చురకలంటించారు. జూన్‌లో లక్ష మందితో బీసీ గర్జన నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్ ప్రకటించారు. 

ఇకపోతే.. బుధవారం నిజాం కళాశాల మైదానంలో ఖేలో భారత్ -జితో భాగ్యనగర్ లో భాగంగా జరుగుతున్న క్రీడా పోటీల్లో ఫైనల్ మ్యాచ్ కు హాజరైన బండి సంజయ్ మాట్లాడుతూ మరో ఐదు నెలలు వేచి చూడాలనీ, సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం వందల కోట్లు వెచ్చించి సొంత డప్పు కొట్టాలని చూస్తోందన్నారు. బీజేపీకి పెరుగుతున్న ప్రజాదరణ పట్ల ప్రభుత్వం అసహనంతో వ్యవహరిస్తోందనీ, బీజేపీ కార్యకలాపాలను కవర్ చేయవద్దని ఒక వర్గం మీడియాపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని శాఖల వారీగా శ్వేత‌ప‌త్రిం విడుదల చేయాలని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.

Also Read: బీజేపీకి పెరుగుతున్న ఆదరణతో ప్రభుత్వం అసహనంగా వ్యవహరిస్తోంది: బండి సంజ‌య్ కుమార్

బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో స్థానిక క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేందుకు పార్టీ దేశవ్యాప్తంగా క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తోంద‌న్నారు. ఏ రంగంలోనైనా రాణించడానికి, టీమ్ వర్క్ ను అనుకరించడానికి దేశ యువతకు క్రీడాస్ఫూర్తి అవసరమని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో కేవలం రూ.460 కోట్లు మాత్రమే కేటాయించిన క్రీడలకు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం బడ్జెట్ కేటాయింపులను రూ.3,000 కోట్లకు పెంచిందని తెలిపారు. 

తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై దుష్ప్రభావాలను పట్టించుకోకుండా రేట్లు తగ్గించి మద్యం వినియోగాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఉపాధి లేక, పంటలు నష్టపోయి, ఇళ్లు లేక రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కానీ, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ తో పాటు రూ.1,600 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించార‌ని పేర్కొన్నారు. టీఆర్ ఎస్ అధినేత తెలంగాణ ప్రజలను పట్టించుకోవడం లేదని సంజయ్ కుమార్ అన్నారు. కానీ, పంజాబ్ లోని రైతులకు నష్టపరిహారం ఇవ్వడం, మహారాష్ట్రకు చెందిన ఒకరికి ఉద్యోగాలు కల్పించడం, తెలంగాణ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేసిన అధికారిని తిరిగి తీసుకురావడం, లక్షల జీతంతో ప్రత్యేక సలహాదారుగా నియమించడం వంటి అంశాల‌ను ప్ర‌స్తావించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CP Sajjanar Serious On Journalist: ఎక్కడున్నా తీసుకొస్తా… ఇన్వెస్టిగేట్ చేస్తా | Asianet News Telugu
IMD Rain Alert : సంక్రాంతి పండగపూట తెలంగాణలో వర్షాలు... ఈ రెండు జిల్లాలకు రెయిన్ అలర్ట్