ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ: ఎజెండా ఇదీ...

By narsimha lodeFirst Published Aug 5, 2020, 2:37 PM IST
Highlights

తెలంగాణ కేబినెట్ సమావేశం బుధవారం నాడు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ప్రారంభమైంది.  పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు.సుమారు రెండు  మాసాల తర్వాత కేబినెట్ సమావేశం ఇవాళ  సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోంది. 

హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం బుధవారం నాడు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ప్రారంభమైంది.  పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారు.సుమారు రెండు  మాసాల తర్వాత కేబినెట్ సమావేశం ఇవాళ  సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోంది. 

తెలంగాణ సచివాలయం పాత భవనాలను కూల్చివేశారు. ఇదే ప్రాంగణంలో కొత్త భవనాలను నిర్మించనున్నారు. కొత్త సచివాలయ భవన సముదాయ నిర్మాణానికి సంబంధించి డిజైన్లకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

పలు డిజైన్లను కేసీఆర్ పరిశీలించారు. చెన్నైకి చెందిన ఆర్కిటెక్టులు ఆస్కార్-పొన్ని జంట రూపొందించిన సచివాలయం డిజైన్లకు సీఎం ఎంపిక చేశారు.  అయితే ఈ డిజైన్లలో కొన్ని మార్పులు చేర్పులను సీఎం సూచించారు. ఈ డిజైన్లకు తుది మెరుగులు దిద్దనున్నారు ఆర్కిటెక్టులు. సచివాలయం కొత్త డిజైన్లకు ఆమోదం తెలపడంతో పాటు టెండర్ల నిర్వహణ, నిర్మాణ పనుల బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది. 

సచివాలయంలో అన్ని శాఖల ప్రధాన కార్యాలయాలతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్ఓడీలు ఒకే చోట ఉండేలా భవనాలను నిర్మించనున్నారు. ఈ కార్యాలయాలకు సమీపంలోనే ఆయా మంత్రుల కార్యాలయాలు కూడ నిర్మించనున్నారు. సుమారు 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త సచివాలయాన్ని నిర్మించనున్నారు.  ఈ భవన నిర్మాణానికి సుమారు రూ. 450 కోట్లు వ్యయమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 

కరోనా నేపథ్యంలో స్కూల్స్, కాలేజీలను తెరిచే విషయమై కూడ కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ నెలాఖరు వరకు స్కూల్స్, కాలేజీలను తెరవకూడదని కేంద్రం తెలిపింది. సెప్టెంబర్ మాసంలో ఒకవేళ కాలేజీలు, స్కూల్స్ తెరిస్తే ఏ రకమైన పద్దతులను అవలంభించాలనే దానిపై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు.

also read:నేడు తెలంగాణ కేబినెట్ భేటీ: కొత్త సచివాలయ డిజైన్లకు ఆమోదం

డిజిటల్ విధానాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది. నీటి పారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు.ఈ విషయమై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. 

కరోనాను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడ ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇప్పటికే గ్రామాల్లో కూడ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో  ఈ వైరస్ ను ఎలా కట్టడి చేయాలనే దానిపై చర్చించనున్నారు.
 

click me!