కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ: అజెండా ఇదే

By Siva KodatiFirst Published Oct 10, 2020, 4:31 PM IST
Highlights

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొద్దిసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ఆమోదించనుంది మంత్రివర్గం. ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువుంటే పోటీకి అనర్హులనే నిబంధన తొలగించనుంది.

ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొద్దిసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును ఆమోదించనుంది మంత్రివర్గం.

ఇద్దరు పిల్లల కన్నా ఎక్కువుంటే పోటీకి అనర్హులనే నిబంధన తొలగించనుంది. పదేళ్లపాటు డివిజన్ల రిజర్వేషన్లు కొనసాగించేలా నిర్ణయం తీసుకోనుంది.

కార్పోరేటర్లకు ఇచ్చే నిధులకు కూడా సవరణ చట్టంలో చేర్చనుంది. ఇటు యాసంగీలో నియంత్రిత వ్యవసాయ సాగు, వానాకాలం పంట కొనుగోలుపైనా చర్చించనుంది కేబినెట్.

సినిమా థియేటర్స్, విద్యాసంస్థల ప్రారంభంపైనా కూడా చర్చించే అవకాశం వుంది. ఈ నెల 13, 14 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాల్సిన తీర్మానాలను కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించే అవకాశం ఉంది.

సెప్టెంబరు 7 నుంచి సెప్టెంబరు 16 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఆ వర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పలు కీలక బిల్లులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.

వీఆర్వో వ్యవస్థతో పాటు రెవెన్యూ చట్టానికి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. భూముల రిజిస్ట్రేషన్ సరళతరం చేసేందుకు కొత్త చట్టాన్ని తెస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా ధరణి పోర్టల్‌ను తీసుకొస్తున్నామని..99.9 శాతం భూముల సమస్యలకు అదే పరిష్కారం చూపిస్తుందని వెల్లడించింది.
 

click me!