నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ భేటీ: తెలంగాణ అసెంబ్లీ రద్దు?

Published : Sep 06, 2018, 06:23 AM ISTUpdated : Sep 09, 2018, 12:03 PM IST
నేడు మధ్యాహ్నం ఒంటి గంటకు కేబినెట్ భేటీ:  తెలంగాణ అసెంబ్లీ రద్దు?

సారాంశం

తెలంగాణ రాష్ట్ర శాసనసభను రద్దు చేసేందుకు సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. 


హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర శాసనసభను రద్దు చేసేందుకు సెప్టెంబర్ 6వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అసెంబ్లీ రద్దు అంశానికి సంబంధించి తీర్మానం చేసిన తర్వాత కేబినెట్ ముగించనున్నారు.

సెప్టెంబర్ 6వ  తేదీన ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకు టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్ హైద్రాబాద్ లోనే ఉండాలని సూచించాడు.మధ్యాహ్నం ఒంటిగంటకు కేబినెట్ సమావేశమై అసెంబ్లీ రద్దుకు సంబంధించిన విషయమై తీర్మానం చేయనున్నట్టు తెలుస్తోంది.

మరో వైపు అసెంబ్లీ రద్దు తీర్మానం తర్వాత రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో కేసీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ రద్దుకు సంబందించి కేబినెట్ సిఫారసు లేఖను గవర్నర్ కు అందించనున్నారు.

గవర్నర్ తో భేటీ  ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడనున్నారు. ముందుగానే ఎందుకు అసెంబ్లీని రద్దు చేయాల్సి వచ్చిందో వివరించే అవకాశం ఉంది.

కేబినెట్ సమావేశంలో  అసెంబ్లీ రద్దుకు సంబంధించి తీర్మానం  చేసిన గవర్నర్ ను  కలుస్తారు. రద్దు ప్రతిని సీఎం గవర్నర్ కు అందిస్తారు.ఆ తర్వాత గన్‌పార్క్ వద్దకు చేరుకొని అమరులకు నివాళులు అర్పించనున్నారు. అక్కడి నుండి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ భవన్ కు చేరుకొని మీడియాతో మాట్లాడనున్నారు.

 

PREV
click me!

Recommended Stories

BRS Boycotts Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఎదుట బిఆర్ఎస్ నాయకుల నిరసన| Asianet News Telugu
Kavitha Pressmeet: నా రక్తం ఉడుకుతోంది KCRపై CMరేవంత్ వ్యాఖ్యలను ఖండించిన కవిత | Asianet News Telugu