లాక్‌డౌన్ పొడిగింపు, రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ: తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలివే..!!

Siva Kodati |  
Published : Jun 08, 2021, 09:42 PM IST
లాక్‌డౌన్ పొడిగింపు, రేషన్ డీలర్ల సమస్యలపై కేబినెట్ సబ్‌కమిటీ: తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాలివే..!!

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, పీఆర్‌సీపై చర్చించింది. దీనిలో భాగంగా లాక్‌డౌన్‌ను మరో పదిరోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది. అలాగే లాక్‌డౌన్‌ నిబంధనలు సడిలించాలని నిర్ణయం తీసుకుంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌, పీఆర్‌సీపై చర్చించింది. దీనిలో భాగంగా లాక్‌డౌన్‌ను మరో పదిరోజుల పాటు పొడిగించాలని నిర్ణయించింది. అలాగే లాక్‌డౌన్‌ నిబంధనలు సడిలించాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉన్న లాక్‌డౌన్‌ సడలింపును సాయంత్రం 5గంటల వరకు పొడిగించింది. ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట సమయం ఇచ్చారు. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు పూర్తి లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది.  

రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయాన్ని సడలించినప్పటికీ కొవిడ్‌ ఉద్ధృతంగా వున్న సత్తుపల్లి, మధిర, నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు కొనసాగుతున్న ఆంక్షలను యథావిధిగా కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.  

దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4,46,169 మంది అర్హులకు రేషన్‌ కార్డులను అధికారులు జారీ చేయనున్నారు. ఈ మేరకు 15 రోజుల్లో రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

Also Read:తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు: కేబినెట్‌ కీలక నిర్ణయం, సాయంత్రం 5 వరకు సడలింపు

అలాగే రేషన్ డీలర్ల కమీషన్, ఇతర సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నియమించారు కేసీఆర్. ఈ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని, సబిత, ఇంద్రకరణ్ రెడ్డిలు సభ్యులుగా వుంటారు. 

వర్షాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ సంసిద్ధతపైనా కేబినెట్ చర్చించింది. రాష్ట్రంలో కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై మంత్రిమండలి హర్షం వ్యక్తం చేసింది. గతేడాది కోటికిపైగా ఎకరాల్లో మూడుకోట్ల టన్నుల వరి దిగుబడి రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. సాకుగు కృషి చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులు, సిబ్బందిని కేబినెట్‌ అభినందించింది. అలాగే రానున్న వర్షాకాలం సాగు కోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.  

PREV
click me!

Recommended Stories

Panchayat Elections: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జోరు !
డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!