గృహ లక్ష్మీ పథకం కింద 4 లక్షల మందికి ఇళ్లు.. కాశీ, శబరిమలలో వసతి గృహాలు : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

Siva Kodati |  
Published : Mar 09, 2023, 07:54 PM IST
గృహ లక్ష్మీ పథకం కింద 4 లక్షల మందికి ఇళ్లు.. కాశీ, శబరిమలలో వసతి గృహాలు : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలివే

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రిమండలి . శబరిమల, కాశీలలో వసతి గృహాల నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది మంత్రిమండలి. దీనికి సంబంధించిన వివరాలను మంత్రి హరీశ్ రావ్ ఇతర మంత్రులతో కలిసి మీడియాకు తెలిపారు. 

  • గృహ లక్ష్మీ పథకం ద్వారా 4 లక్షల మందికి ఇళ్లు మంజూరు
  • రెండో విడత దళితబంధు 1 లక్ష 30వేల కుటుంబాలకు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం
  • దళితబంధు వేడుకలను ఆగస్టు నెలలో ప్రతీ ఏటా నిర్వహించాలని నిర్ణయం
  • 119 నియోజకవర్గల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో దళిత బంధు నిధులు పంపిణీ 
  • సొంత జాగ ఉన్న వారికి ఇల్లు కట్టించడానికి గృహ లక్ష్మీ పథకం పేరుతో ఆర్ధిక సాయం
  • 3 వేల చొప్పున ప్రతీ నియోజకవర్గానికి మొత్తం 4 లక్షలు ఇవ్వాలని నిర్ణయం
  • ప్రతీ ఇంటికి 3 లక్షల రూపాయలను గ్రాంట్ గా మూడు దఫాలుగా ఇవ్వాలని నిర్ణయం
  • గృహలక్ష్మీ పథకం కోసం రూ.12 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపు
  • కట్టే ఇళ్లన్నీ మహిళ పేరు మీద ఇవ్వాలని నిర్ణయం
  • గత ఇందిరమ్మ పథకంలో రూ.4 వేల కోట్ల అప్పులను రద్దు చేస్తూ నిర్ణయం 
  • గొర్రెల పంపిణీకి సంబంధించి 7 లక్షల లబ్ధిదారుల్లో గతంలోనే 50 శాతం పూర్తి 
  • రూ. 4 వేల కోట్లకు పైగా మళ్ళీ నిధులు కేటాయింపు
  • కలెక్టర్ పర్యవేక్షణలో గొర్రెల పంపిణీ
  • 4 లక్షల ఎకరాల పోడు భూములకు సంబంధించి 1 లక్షా 55 వేల 393 మందికి పట్టాల పంపిణీ చేయాలని కేబినెట్ నిర్ణయం
  • అంబేడ్కర్ విగ్రహం ఏప్రిల్ 14వ తేదీన ఘనంగా ప్రారంభించాలని నిర్ణయం
  • ఏప్రిల్ 14న భారీ బహిరంగ సభ
  • జీవో 58, 59 ఒక్క రూపాయి లేకుండా పేదలకు ఇంటిపై హక్కును కల్పించాలని కేబినెట్ నిర్ణయం
  • జీవో 58 కింద 1 లక్ష 45 వేల మందికి పట్టాలు ఇప్పటికే పంపిణీ
  • కాశీలో తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఒక వసతి గృహం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఇందుకోసం రూ.25 కోట్ల నిధులు మంజూరు
  • శబరిమలలోనూ రూ. 25 కోట్లతో వసతి గృహం నిర్మించాలని కేబినెట్ నిర్ణయం
  • త్వరలోనే శబరిమలకు మంత్రుల బృందం 
  • గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయాన్ని ఆమోదించిన క్యాబినెట్.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఫ్యూచర్ సిటీ భవనాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy Inaugurates Future City
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్| Asianet Telugu