
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం మంగళవారం నాడు ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకాంశాలపై చర్చించనున్నారు. రిజిస్ట్రేషన్ చార్జీలు, భూముల విలువ పెంపుతో పాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి అంశాలపై కూడ కేబినెట్ లో చర్చించనున్నారు.
ప్రధానంగా రాష్ట్రంలో 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో విధి విధానాలపై కేబినెట్లో చర్చించనున్నారు. ఏపీతో నెలకొన్న జలవివాదంపై కూడ ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయమై రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నాయి. ఈ విషయమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు.
భూముల విలువను పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ విషయమై కేబినెట్ ఆమోదం తెలపనుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై కూడ కేబినెట్ లో చర్చించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ సబ్ కమిటీ చేసే సిఫారసులపై చర్చించనున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున రైతులకు అవసరమైన ఎరువువులు, విత్తనాలు రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.