ప్రారంభమైన తెలంగాణ కేబినెట్: లాక్‌డౌన్‌పైనే ప్రధాన చర్చ

By narsimha lode  |  First Published May 11, 2021, 2:17 PM IST

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం  మంగళవారం నాడు మధ్యాహ్నం ప్రగతిభవన్ లో ప్రారంభమైంది. 


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం  మంగళవారం నాడు మధ్యాహ్నం ప్రగతిభవన్ లో ప్రారంభమైంది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు  లాక్‌డౌన్ విధించాలనే డిమాండ్ నెలకొంది. లాక్‌డౌన్ విధించినా కూడ కరోనా కట్టడిని చేయలేని పరిస్థితులు నెలకొన్నాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.  లాక్‌డౌన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

also read:రేపు తెలంగాణ కేబినెట్ భేటీ: లాక్‌డౌన్‌పై చర్చించే చాన్స్

Latest Videos

ఈ విషయమై సీఎం కేసీఆర్ పలువురి అభిప్రాయాలను తీసుకొన్నారని సమాచారం. కరోనా విషయమై విచారణ సందర్భంగా  తెలంగాణ హైకోర్టు  రాష్ట్ర ప్రభుత్వం తీరుపై సీరియస్ వ్యాఖ్యలు చేసింది.  రాష్ట్రంలో ఈ నెల 15 నుండి లాక్‌డౌన్ విధించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందనే ప్రచారం సాగుతోంది.  అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే రాష్ట్రంలో  నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది. అయినా కరోనా కేసుల్లో తగ్గుదల లేదు. లాక్‌డౌన్ విధిస్తే  ధాన్యం కొనుగోలు విషయమై ఏ రకమైన ప్రభావం ఉంటుందనే దానిపై కేబినెట్ లో చర్చించనున్నారు. 

click me!