కేసీఆర్ మాట తమిళిసై నోట: ఏకంగా అమిత్ షాకే వార్నింగ్

By Sree sFirst Published Mar 6, 2020, 1:43 PM IST
Highlights

గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఒక ఆసక్తికర స్పీచ్ ను ఇరు సభలను ఉద్దేశించి అన్నారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో చెప్పడంతోపాటుగా తెలంగాణ అభివృదిది పథంలో దూసుకుపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కారణం అని తెలిపారు. 

తెలంగాణ బడ్జెట్ ను ఆదివారం ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఒక ఆసక్తికర స్పీచ్ ను ఇరు సభలను ఉద్దేశించి అన్నారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతూ వచ్చిందో చెప్పడంతోపాటుగా తెలంగాణ అభివృదిది పథంలో దూసుకుపోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ కారణం అని తెలిపారు. 

ప్రసంగాన్ని ముగించే తరుణంలో తెలంగాణ గంగా జమున తెహజీబ్ అని గుర్తు చేస్తూ ఆ విషయంపై ఒక కీలక విషయాన్నీ చెప్పారు. మతసామరస్యానికి తెలంగాణ ప్రతీక అంటూ.. ప్రతి మతాన్ని గౌరవిస్తామని, మాత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే.. ఉక్కుపాదంతో అణచివేస్తామని అన్నారు. 

తెలంగాణాలో అన్ని పండుగలను జరుపుకుంటారని, రాష్ట్రం కూడా అన్ని పండగలను జరుపుకోవడానికి వాతావరణం కల్పిస్తోస్తుందని, అన్ని మతాల వారు ఇక్కడ కలిసి మెలసి జీవిస్తున్నారని ఆమె అన్నారు. 

ఇలా ఒక రకంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రభుత్వం ఎంత గట్టి నిర్ణయం తీసున్నాడో కెసిఆర్ మనకు ఇక్కడ అర్థమవుతుంది. ప్రసంగం చదివింది గవర్నరే అయినా ఆ మాటలు రాష్ట్ర ప్రభుత్వానివే కదా!

ఇలా అమిత్ షా హైదరాబాద్ లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా హైదరాబాద్ లో సభ పెడుతా అని ప్రకటించిన నేపథ్యంలో ఇలా గవర్నర్ ప్రసంగంలో దాన్ని చేర్చడం కెసిఆర్ ఎంతటి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారో ఇక్కడ అర్థం చేసుకోవాలిసి ఉంటుంది. 

గవర్నర్ ను కేంద్రం నియమిస్తుంది. కొన్ని రాష్ట్ట్రాల్లో గవర్నర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా కూడా తయారవుతారు. కిరణ్ బేడీ ఉదంతం చూస్తే పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఆవేదన చూస్తే మనకు ఇట్టే అర్థమయిపోతుంది. అలాంటి గవర్నర్ నోటితో కెసిఆర్ ఇలా కేంద్రానికి షాక్ ఇచ్చినట్టుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. 

దేశ లౌకికత్వాన్ని కాపాడడానికి ఎల్లవేళలా తెలంగాణ ప్రభుత్వం కంకణం కట్టుకుందని, తెలంగాణలో ఎట్టి పక్షంలోనూ ఆ పరిస్థితికి భంగం కలిగించే పనిని చేయబోమని ఆమె పునరుద్ఘాటించారు. 

ఇక ఈ ప్రసంగంలో ఆమె పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని  చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు సాగుతోందని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. బీడి కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం రూ. 2016 పెన్షన్ అందిస్తున్న విషయాన్ని గవర్నర్ గుర్తు చేశారు. 

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ సంక్షోభాన్ని చవిచూసినట్టు చెప్పారు. ఆసరా పెన్షన్లు పేదల జీవితాల్లో  వెలుగులు నింపినట్టుగా ఆమె చెప్పారు.రాష్ట్రం కోసం ఉద్యమించిన నేత రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని గవర్నర్ చెప్పారు.కేసీఆర్ దార్శనికతతో రాష్ట్రం పురోభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారామె. 

Also read:తెలంగాణ బడ్జెట్ సమావేశాలు లైవ్ అప్ డేట్స్:రాష్ట్రం కోసం ఉద్యమించిన నేతే పాలిస్తున్నాడు: గవర్నర్
వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్‌ను అందిస్తున్నామని తమిళిసై చెప్పారు. అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతు భీమా పథకాన్ని అమలు చేస్తున్నట్టు గవర్నర్ చెప్పారు. 

ఈ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.  తెలంగాణలో ఒకప్పుడు వ్యవసాయం దండగ అనే పరిస్థితులు ఉండేవి కానీ, ప్రస్తుతం వ్యవసాయం పండగ అనే పరిస్థితులు నెలకొన్నాయని ఆమె చెప్పారు. 

రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించామన్నారు. అతి తక్కువ కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసినట్టు చెప్పారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలు పెరిగాయన్నారు. 

కళ్యాణ్‌లక్ష్మీ, షాదీ ముబారక్ లాంటి స్కీమ్‌ల ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పేదల కుటుంబాల్లో వెలుగులు నిండాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించి ప్రాణాలు ఆర్పించిన  కుటుంబాలు రూ. 10 లక్షల ఆర్ధిక సహాయం అందించినట్టుగా తమిళిసై చెప్పారు.

బీసీ వర్గాల కార్యాలయాల కోసం హైద్రాబాద్‌లో స్థలాన్ని కేటాయించినట్టుగా ఆమె చెప్పారు.  విద్యుత్ తలసరి వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. కొత్త పంచాయితీరాజ్, మున్సిపల్ చట్టాలను తీసుకొచ్చినట్టుగా ఆమె గుర్తు చేశారు. వేగంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మిస్తున్నట్టుగా గవర్నర్  చెప్పారు.

click me!