ఆర్ధిక మాంద్యం ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై పడింది. ఆదాయం భారీగా తగ్గిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
హైదరాబాద్: గతంలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఇవాళ సమర్పించిన అంచనాలకు చాలా వ్యత్యాసం ఉంది.తెలంగాణ రాష్ట్రంలో అంచనా వేసిన ఆదాయం రాకుండా తగ్గిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆర్ధిక మాంధ్యం ప్రభావం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆయన ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆధాయంలో 22.69 శాతం వృద్ది ఉంటుందని అంచనా వేస్తే 2019-20 మొదటి త్రైమాసికంలో కేవలం 1.36 శాతం మాత్రమే వృద్ధి సాధ్యమైంది. తెలంగాణ రాష్ట్రంలో కూడ 15 శాతం ఆదాయం వస్తోందని అంచనా వేస్తే 5.46 శాతం మాత్రమే ఆదాయం వచ్చిందని కేసీఆర్ ప్రకటించారు.
గత ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్రం వాణిజ్య పన్నుల విభాగంలో 13.6 శాతం సగటు వార్షిక వృద్ది రేటు సాధిస్తే ఈ ఏడాది కేవలం 6.61 శాతం మాత్రమే వృద్దిరేటు సాధించింది. ఎక్సైజ్ ద్వారా వచ్చే ఆదాయంలో ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో కేవలం 2.59 శాతం మాత్రమే సాధ్యమైందని బడ్జెట్ ప్రసంగంలో సీఎం పేర్కొన్నారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా గత ఏడాది వరకు 19.8 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలలు 17.5 శాతం మాత్రమే అభివృద్ధి నమోదైంది.
గత ఐదేళ్లలో మోటారు వాహనాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 19 శాతం సగటు వార్షిక వృద్ధిరేటు సాధిస్తే ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లో మైనస్ 2.06 శాతానికి పడిపోయినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
రాష్ట్రానికి వచ్చే నాన్ ట్యాక్స్ రెవిన్యూ లో కూడ భారీగా తగ్గుదల నమోదైనట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. నాన్ ట్యాక్స్ రెవిన్యూలో గత ఏడాది వరకు 14.9 శాతం సగటు వార్షిక వృద్దిరేటు సాధిస్తే ఈ ఏడాది నాలుగు నెలల్లో మైనస్ 14.16 శాతం వృద్ధిరేటు మాత్రమే సాధ్యమైంది. నాన్ ట్యాక్స్ రెవిన్యూ 29 శాతం తగ్గిందని సీఎం తేల్చి చె్పపారు.
రాష్ట్రం ఆదాయం తగ్గిపోవడంతో పన్నుల్లో వాటా చెల్లింపులు, నిధుల బదలాయింపులో కూడ కేంద్రం నుండి నిధుల్లో కోతలు పడ్డాయని సీఎం చెప్పారు. 2019-20 ఆర్ధిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుండి రావాల్సిన నిధుల్లో 4.19 శాతం కోత పెట్టిందని రాష్ట్రం ప్రకటించింది.
సంబంధిత వార్తలు
తెలంగాణ బడ్జెట్ : రైతుబందు పథకానికి రూ. 12 వేల కోట్లు
తెలంగాణ బడ్జెట్ 2019: ముఖ్యాంశాలు
రూ.1,46,492 కోట్లతో తెలంగాణ బడ్జెట్: ఆర్ధిక లోటు రూ. 24,081.74 కోట్లు