Telangana Budget 2022: ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

Published : Mar 07, 2022, 01:30 PM IST
Telangana Budget 2022: ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు

సారాంశం

ఆరోగ్య శ్రీ పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నామని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు ఇవాళ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 

హైదరాబాద్: Aarogyasri పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నట్టుగా తెలంగాణ  ప్రభుత్వం ప్రకటించింది.

తెలంగాణ అసెంబ్లీలో ఆర్ధిక శాఖ మంత్రి Harish Rao సోమవారం నాడు  Telangana Budget 2022  ను ప్రవేశ పెట్టారు.  తెలంగాణ రాష్ట్రంలోని పేదలు ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఆరోగ్యశ్రీని ఎక్కువగా ఉపయోగించుకొంటారు. దీంతో ఆరోగ్య శ్రీ పథకం పరిమితిని రూ. 2 లక్షల నుండి రూ. 5 లక్షలకు పెంచాలని నిర్ణయం తీసుకొన్నామని మంత్రి హరీష్ రావు తెలిపారు. కొన్ని రకాల చికిత్సల కోసం అవసరమైతే రూ. 10 లక్షలను కూడా ఈ పథకం కింద ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

Heart, లివర్, బోన్ మార్ వంటి అవయవ మార్పిడి చికిత్సలకు కూడా ఆరోగ్య శ్రీ ద్వారా చేయించుకొనే వెసులబాుటును కల్పిస్తున్నట్టుగా మంత్రి హరీష్ రావు ప్రకటించారు.  ఇందుకు గాను ఆరోగ్య శ్రీ పథకం కింద రూ. 10 లక్షలను కూడా  వినియోగించుకొనే వెసులుబాటును రోగులకు అందిస్తామని హరీష్ రావు తెలిపారు. ఆరోగ్య శ్రీ పరిమితిని పెంచడం వల్ల పేదలకు ప్రయోజనం కలుగుతుందన్నారు.  రాష్ట్రంలోని పేదలు ప్రాణాంతక వ్యాధుల నుండి చికిత్స తీసుకొనే వెసులుబాటు దక్కుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 22 ఎంసీహెచ్ ఆసుపత్రులను రూ. 407 కోట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మంత్రి వివరించారు. యునిసెఫ్ సూచించిన ప్రమాణాల ప్రకారంగా లేబర్ రూమ్ లను ఆధునీకరించామని మంత్రి హరీష్ రావు వివరించారు.

రాష్ట్రంలో 300 అమ్మ ఒడి వాహనాల ద్వారా మారుమూల పల్లెల నుండి Pregnant స్త్రీలను దవాఖాలకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. హై రిస్క్ ప్రెగ్నెన్సీని గుర్తించడంలో ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచామని మంత్రి తెలిపారు.  ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని మంత్రి ప్రస్తావించారు.

కరోనా కట్టడిలో

Corona  కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం సమర్ధవంతంగా వ్యవహరించిందని రాష్ట్ర High Court ప్రశంసించిన విషయాన్ని మంత్రి హరీష్ రావు గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో పడకలను ఆక్సిజన్ పడకలుగా మార్చామన్నారు. పీడియాట్రిక్ విభాగాలకు ఐసీయూలను కూడా ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో Oxygen ఉత్పత్తి సామర్ధ్యాన్ని 135 టన్నుల నుండి 550 టన్నులకు పెంచామన్నారు.

రాష్ట్రంలో Fever సర్వే మంచి ఫలితాలను ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఇంటి వద్దకే వెళ్లి ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించినట్టుగా మంత్రి తెలిపారు.కరోనా నిర్ధారణ అయిన వారికి వెంటనే అవసరమైన మందులను కూడా అందించామన్నారు.  గత ఏడాది నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో జ్వర సర్వేను టెస్ట్ ప్రాక్టీస్ గా ప్రకటించిందని మంత్రి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రాథమిక దశలోనే కట్టడి చేసేందుకు  ఇది సరైన పద్దతి అని మంత్రి హరీష్ రావు వివరించారు.

 


 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?